For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI: అతనిపై వేటు.. లక్నోతో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్‌తో పాటు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో అసాధారణ విజయాన్నందుకుంది. ఉప్పల్ వేదికగానే రెండో మ్యాచ్‌ జరగనుండటంతో ఈ సారి 300 స్కోర్ నమోదవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

SRH Playing XI vs LSG for IPL 2025 Aniket Verma Out and Rahul Chahar IN

బ్యాటింగ్ పిచ్..?
ఈ మ్యాచ్‌కు కూడా బ్యాటింగ్‌ పిచ్ తయారు చేయనుండటంతో మరోసారి పరుగుల వరద పారనుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్.. ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో వికెట్ తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే ఉంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు లయ అందుకుంటే ఆ జట్టుకు తిరుగుండదు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్-లక్నో పోరు హోరాహోరీగా ఉండనుంది.

మార్పుల్లేకుండానే..
ఈ మ్యాచ్‌‌కు సన్‌‌రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించనుంది. తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ సమష్టి ప్రదర్శన చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదరిపోయే ఆరంభాన్ని అందించగా.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ మెరుపులు మెరిపించారు. యువప్లేయర్ అనికేత్ వర్మ భారీ సిక్సర్‌తో ఆక్టుకున్నా అభినవ్ మనోహర్ విఫలమయ్యాడు.

బౌలింగ్ విభాగంలో షమీ, సిమర్జీత్ సింగ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ రాణించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడమ్ జంపా పర్వాలేదనిపించాడు. పిచ్ కండిషన్స్ మారితే తప్పా సన్‌రైజర్స్ తుది జట్టులో మార్పు జరిగే అవకాశం లేదు. రాహుల్ చాహర్ ఆడించాలనుకుంటే యువ ప్లేయర్ అనికేత్ వర్మపై వేటు పడుతుంది. అంతే తప్పా మిగతా లైనప్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా

Take a Poll
Story first published: Tuesday, March 25, 2025, 16:47 [IST]
Other articles published on Mar 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+