Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs LSG: మార్క్‌రమ్, క్లాసెన్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నో వేదికగా శుక్రవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

నేషనల్ డ్యూటీ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ ఈ మ్యాచ్‌‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఘోర పరాజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉన్న ఏకైక సానుకూలాంశం మార్క్‌రమ్, క్లాసెన్ రీఎంట్రీ ఇవ్వడం. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది.

SRH Playing XI vs LSG

టీమ్ కాంబినేషన్‌లో కూడా లోపాలు కనిపించాయి. మార్క్‌రమ్, క్లాసెన్ చేరికతోనైనా... జట్టు విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.? ఈ ఇద్దరి రాకతో తొలి మ్యాచ్ ఆడిన ఓవర్ సీస్ ఆటగాళ్లు గ్లేన్ ఫిలిప్స్, ఫజలక్ ఫరూఖీ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

హయ్యెస్ట్ ప్రైజ్ ట్యాగ్ కలిగిన హరీ బ్రూక్ తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనా.. అతని చోటుకు వచ్చిన డోకా లేదు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అతను జట్టులో కొనసాగనున్నాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఆడనున్నారు.
దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

మయాంక్ అగర్వాల్ క్రీజులో నిలబడినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగనుండగా.. తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి టీమ్ ఓటమికి కారణమయ్యాడు. త్రిపాఠి కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది.

నాలుగో స్థానంలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు నెలలుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఐదో స్థానంలో హరీ బ్రూక్, ఆరో స్థానంలో హెన్రీచ్ క్లాసెన్ ఆడనుండగా.. సుందర్ ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

ఈ ముగ్గురు జట్టులో ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఆడనుండగా.. ఆదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్‌లో నటరాజన్, ఆదిల్ రషీద్ మినహా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అబ్దుల్ సమద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.

Story first published: Thursday, April 6, 2023, 18:23 [IST]
Other articles published on Apr 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+