Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs KKR: ఆ స్టార్ బ్యాటర్‌పై వేటు.. కోల్‌కతాతో ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో హ్యాట్రికి పరాజయాల తర్వాత విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అదే జోరును కొనసాగించాలనుకుంటోంది.

ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలనుకుంటోంది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగడంతో కోల్‌కతా చిత్తయ్యింది.

Harry Brook SRH

సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుండటం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. అయితే టీమ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. నటరాజన్‌ను బౌలింగ్‌లో వాడుకొని బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అబ్దుల్ సమద్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న హ్యారీ బ్రూక్‌ను పక్కనపెట్టాలనుకుంటే మాత్రం.. గ్లేన్ ఫిలిప్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే కేకేఆర్‌పై హ్యారీ బ్రూక్ సెంచరీ చేసిన నేపథ్యంలో అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్.. ఒక్క సెంచరీ మినహా రాణించిందేం లేదు. ఈ సీజన్‌లో హ్యారీ బ్రూక్ వరుసగా 13(21), 3(4), 13(14), 100*(55), 9(7), 18(13), 7(14), 0(2) పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు.

ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో సొంత అభిమానులే హ్యారీ బ్రూక్‌ను బండ బూతులు తిడుతున్నారు. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ మినహా మరే బ్యాటర్ రాణించడం లేదు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. హెన్రీచ్ క్లాసెన్ సత్తా చాటడం టీమ్‌కు కలిసొచ్చే అంశం. అబ్దుల్ సమద్, అకీల్ హొస్సెన్ ఫినిషర్ బాధ్యత మోయనుండగా.. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మయాంక్ మార్కండే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు.

కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, అకీల్ హోస్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Story first published: Wednesday, May 3, 2023, 22:40 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+