Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs KKR: రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు.. కోల్‌కతాతో ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు వరుస ఓటముల తర్వాత తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం కోల్‌కతా‌లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. అదే జోరును కొనసాగించాలనుకుంటోంది.

మరోవైపు సంచలన ప్రదర్శనతో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌లను మట్టికరిపించిన కేకేఆర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను కనువిందు చేయనుంది.

Harry brook

ఈడెన్ గార్డెన్ పిచ్ కండిషన్స్ ఆధారంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. కేకేఆర్‌తో ఓ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. ఆదిల్ రషీద్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రూ.13.25 కోట్ల ఆటగాడు హరీ బ్రూక్ తీవ్రంగా నిరాశ పరుస్తుండటంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన హరీ బ్రూక్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో.. 13, 3, 13 పరుగులు మాత్రమే చేసి జట్టుకు భారంగా మారాడు. కోటికి ఒక్క పరుగు చొప్పున పరుగులు చేస్తున్న హరీ బ్రూక్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ తరఫున 10 మ్యాచ్‌ల్లోనే 80.90 సగటుతో 809 పరుగులు బాదిన బ్రూక్.. 4 సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు.

ఈ పెర్ఫామెన్స్‌తో అతనిపై కోట్లు కుమ్మరించిన సన్‌రైజర్స్.. ఇప్పుడు అతని ఆటను చూసి నెత్తి పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే కొన్ని మ్యాచ్‌లకు అతన్ని పక్కనపెట్టాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పిచ్‌.. స్పిన్‌కు అనుకూలంగా ఉండడం.. హరీ బ్రూక్‌కు టర్నింగ్ ట్రాక్స్‌పై మంచి రికార్డు లేని నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టడమే మంచిదని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.

పేసర్లు నటరాజన్, మార్కో జాన్సెన్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కానుండగా ఆదిల్ రషీద్ జట్టులోకి రానున్నాడు. అబ్దుల్ సమద్‌‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనున్నారు. పంజాబ్‌తో అదరగొట్టిన మయాంక్ మార్కండే తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్/ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, అబ్దుల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్/మార్కో జాన్సెన్.

ఇంపాక్ట్ ప్లేయర్: అబ్దుల్ సమద్

Story first published: Thursday, April 13, 2023, 17:54 [IST]
Other articles published on Apr 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+