ఐపీఎల్ 2026 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం కోల్‌కతా వేదికగా జరిగే తమ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో టాప్-3 వైఫల్యం.. పేలవ బౌలింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసాయి.
మరోవైపు కేకేఆర్ కూడా ఓటమితోనే ఈ టోర్నీని ప్రారంభించింది. పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ ముందు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. సన్‌రైజర్స్‌తో పాటు కేకేఆర్ కూడా బౌలింగ్ బలహీనతలతో బాధపడుతుండటంతో ఇరు జట్ల మధ్య జరిగే పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలి మ్యాచ్‌లో చేసిన తమ తప్పిదాలను సరిచేసుకోవడంపై సన్‌రైజర్స్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించింది. కోల్‌కతా మైదానం కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలింగ్ విభాగం రాణించడం కీలకంగా మారింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఎషాన్ మలింగాపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో బ్రైడన్ కార్స్‌ను ఆడించవచ్చు. లియామ్ లివింగ్ స్టోన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఎషాన్ మలింగా స్థానంలో డేవిడ్ పైన్ బరిలోకి దిగుతాడు. తొలి మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసాడు. లియామ్ లివింగ్ స్టోన్ బరిలోకి దిగితే.. సలీల్ అరోరా బెంచ్‌కే పరిమితమవుతాడు. అప్పుడు శివమ్ మావి, ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనుండగా.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ఓపెనర్లు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. అనికేత్ వర్మ, లివింగ్ స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. లివింగ్ స్టోన్ ఆడకపోతే సలీల్ అరోరా తుది జట్టులో కొనసాగుతాడు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. హర్ష్ దూబే వద్దనుకుంటే జీషన్ అన్సారీ తుది జట్టులోకి వస్తాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలకం.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్/ఎషాన్ మలింగా/డేవిడ్ పైన్, జయదేవ్ ఉనాద్కత్.