ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది పోరుకు సిద్దమైంది. సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిన ఫైనల్‌కు దూసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్..8 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ టైటిల్ ఫైట్‌లో విజయం సాధించి విజేతగా నిలవడంతో పాటు క్వాలిఫయర్-1తో పాటు లీగ్ దశలో కేకేఆర్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్ చేరిన కేకేఆర్.. అదే జోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.

వ్యూహాత్మక మార్పు..
ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్వాలిఫయర్-2 ఆడిన వేదికగానే ఫైనల్ జరగనుండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ ఫైనల్లో సన్‌రైజర్స్ పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ అనుభవంతో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2కు సన్‌రైజర్స్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. జయదేవ్ ఉనాద్కత్‌తో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే మార్క్‌రమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించే అవకాశం ఉంది. మార్పులు చేయవద్దని భావిస్తే మాత్రం విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించనుంది. గ్లేన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
ఈ ఒక్కటి మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.
ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనాద్కత్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే ట్రావిస్ హెడ్, నటరాజన్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షెహ్‌బాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, జయదేవ్ ఉనాద్కత్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, గ్లేన్ ఫిలిప్స్/ఎయిడెన్ మార్క్‌రమ్
ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్