Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs GT: మిలియన్ డాలర్ ప్లేయర్‌కు నో ఛాన్స్.. గుజరాత్‌తో ఆడే సన్‌రైజర్స్ జట్టు ఇదే!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. 7 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న సన్‌రైజర్స్ ఈ నామమాత్రపు పోరులో విజయం సాధించి తమ అభిమానులను అలరించాలనుకుంటోంది.

మరోవైపు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్.. సన్‌రైజర్స్‌ను ఓడించి క్వాలిఫయర్-1‌కు అర్హత సాధించాలనుకుంటోంది. దాంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది.

SRH

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేజేతులా ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ ఒకే ఓవర్‌లో 31 పరుగులివ్వడం ఆరెంజ్ ఆర్మీ కొంపముంచింది. బ్యాటింగ్‌లోనూ మంచి శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయింది. ఇక నామ మాత్రపు అయిన చివరి రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తామని కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. దాంతో తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

మిలియన్ డాలర్ల ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ పూర్తిగా బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్ గత మ్యాచ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో సత్తా చాటాడు. దాంతో బ్రూక్‌కు చివరి రెండు మ్యాచ్‌ల్లో చోటు దక్కే అవకాశాలు లేవు.

ఓపెనర్లుగా అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ సత్తా చాటుతుండగా.. మిడిలార్డర్‌లో రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌కు దూరమైన మార్కోజాన్సెన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. నటరాజన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనుండగా.. మయాంక్ మార్కండే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలను లీడ్ చేయనున్నాడు.

గుజరాత్‌తో సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)
1.అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్

Story first published: Monday, May 15, 2023, 12:24 [IST]
Other articles published on May 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+