Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: అతనిపై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది. తద్వారా ఈ సీజన్‌ ఫస్టాఫ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్తరీకారం తీర్చుకోవానుకుంటుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ధాటికి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న గుజరాత్ టైటాన్స్.. మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.

హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుండటం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి జోష్‌లో ఉంది. వారం రోజుల పాటు దొరికిన విశ్రాంతి సమయాన్ని ఆటగాళ్లు మాల్దీవుల్లో గడిపారు. ఫ్రెష్‌గా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

SRH Playing XI vs GT for IPL 2025 Simarjeet Singh Likely To Replace Jaydev Unadkat

తుది జట్టులో మార్పులు..?
అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్ స్థిరంగా ఉండటంతో బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడగలరు. స్లో వికెట్ అయితే స్పిననర్లకు అనుకూలిస్తోంది. బ్యాటింగ్ వికెట్ అయితే భారీ స్కోర్లు నమోదవుతాయి. స్లో వికెట్ అయితే 180 పరుగులు చేసినా గొప్ప లక్ష్యమే. ఈ మైదానంలో ఛేజింగ్ జట్లకే విజయాలు దక్కాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. జయదేవ్ ఉనాద్కత్ ప్లేస్‌లో స్పిన్ ఆల్‌రౌండర్‌ను ఆడించవచ్చు. లేదా స్మరన్ రవిచంద్రన్, సిమర్జిత్ సింగ్‌ల్లో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చు.

ఈ ఒక్కటి మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా.. ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండీస్, నితీష్ కుమార్ రెడ్డి మిడిలార్డర్‌లో ఆడనున్నారు. గత మ్యాచ్‌లో కామిందు మెండీస్ ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా పర్వాలేదనిపించారు. మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

షమీ కీలకం..
ప్యాట్ కమిన్స్, హర్షల్‌ పటేల్, మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. షమీ కీలకం కానున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన షమీకి.. అహ్మదాబాద్ పిచ్‌పై మంచి పట్టు ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జీషన్ అన్సారీ ఆడనున్నాడు. జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో ఇతర బౌలర్లు లేదా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా అభినవ్ మనోహర్‌కు అవకాశం ఇవ్వవచ్చు.

గుజరాత్‌తో పోరు.. సన్‌‌రైజర్స్ తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కామిందు మెండీస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: జీషన్ అన్సారీ.

Story first published: Thursday, May 1, 2025, 15:54 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+