For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI: ఆ ఇద్దరిపై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో హ్యాట్రిక్ పరాజయాలతో చతకిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో చిత్తయిన సన్‌‌రైజర్స్ హైదరాబాద్.. సొంతమైదానంలో గుజరాత్‌ను మట్టి కరిపించి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ అదే జోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించాలనుకుంటోంది. పంజాబ్‌తో ఓడిన గుజరాత్.. పటిష్టమైన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను మట్టికరిపించింది. ముఖా ముఖి పోరులోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. గుజరాత్ టైటాన్స్‌ మూడింటిలో గెలుపొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది.

SRH Playing XI vs GT for IPL 2025 Kamindu Mendis Out and Sachin Baby IN

ఫలించని ప్రయోగాలు..
ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో తుది జట్టులో మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. ఆడమ్ జంపా స్థానంలో వియాన్ ముల్డర్, కామిందు మెండీస్‌లను ఆడించినా ప్రయోజనం దక్కలేదు. అయితే టాపార్డర్ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి‌లు దారుణంగా విఫలమవుతున్నారు. హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మలు రాణిస్తున్నా.. వారి బ్యాటింగ్ విజయానికి సరిపోవడం లేదు.

మరోవైపు బౌలింగ్ విభాగం తేలిపోతుంది. ఎంతో అనుభవం కలిగిన మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్ తేలిపోతున్నారు. స్పిన్నర్లు జీషాన్ అన్సారీ, కామిందు మెండీస్, ఆడమ్ జంపా పర్వాలేదనిపిస్తున్నా.. హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ ఆకట్టుకోలేకపోతున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ బౌలింగ్ విభాగంలో మాత్రమే మార్పులు చేసింది. కానీ బ్యాటింగ్ విభాగాన్ని టచ్ చేయలేదు. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరైన బ్యాకప్ బ్యాటర్లు లేరు. కాబట్టి ఈ మ్యాచ్‌కు కూడా తొలి మ్యాచ్ ఆడిన కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఆ ఇద్దరిపై వేటు..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరి నుంచి ఇప్పటి వరకు సరైన ఆరంభం దక్కలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగాల్సిందే. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకుంటున్నాడు. హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ పర్వాలేదనిపిస్తున్నా.. చివరి వరకు ఆడలేకపోతున్నారు. టాప్-6 బ్యాటర్లలో ముగ్గురు చెలరేగినా సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా భారీ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో కామిందు మెండీస్, జీషన్ అన్సారీలో ఒకరిపై వేటు పడనుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌కు అవకాశం దక్కవచ్చు. సిమర్జీత్ సింగ్ స్థానంలో జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడించవచ్చు. షమీ, కమిన్స్ ప్రధాన పేసర్లుగా కొనసాగనుండగా.. హర్షల్ పటేల్ వారితో బంతిని పంచుకోనున్నాడు.

కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్/సచిన్ బేబీ/అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్/జయదేవ్ ఉనాద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/ కామిందు మెండీస్

Story first published: Saturday, April 5, 2025, 16:05 [IST]
Other articles published on Apr 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+