ఐపీఎల్ 2024 సీజన్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో సంచలన ప్రదర్శనతో సత్తా చాటింది.
టీ20ల్లో నయా చరిత్ర..
విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలోనే 277 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌ను 31 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలి మ్యాచ్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కీలక మార్పు చేసింది.

రాహుల్ త్రిపాఠి, మార్కో జాన్సెన్‌లపై వేటు వేసి ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్‌ను బరిలోకి దింపింది. గాయంతో దూరమైన నటరాజన్ స్థానంలో ఉనాద్కత్‌ను తీసుకొచ్చింది. ఈ కాంబినేషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సంచలన విజయాన్ని అందించింది.
అతనిపై వేటు..
ఈ జోరునే అహ్మదాబాద్‌లోని వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్రమోదీ స్టేడియంలో చూపించాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండో విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుంటోంది. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నటరాజన్ ఫిట్‌నెస్ సాధిస్తే స్వల్ప మార్పులు చేయనుంది.
పేలవ ప్రదర్శన కనబర్చిన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో నటరాజన్‌ను బరిలోకి దించనుంది. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ బరిలోకి దిగనున్నారు.
ఆ ముగ్గురికి నిరాశే..
ముంబైతో మ్యాచ్‌లో ఈ టాప్-5 బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముందుగా బ్యాటింగ్ చేస్తే అభిషేక్ శర్మ తుది జట్టులో ఉండనుండగా.. బౌలింగ్ చేస్తే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడు. అభిషేక్ శర్మ, నటరాజన్ లేదా ఉమ్రాన్ మాలిక్‌లను ఆరెంజ్ ఆర్మీ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోనుంది.
లోయరార్డర్‌లో అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్ బ్యాటింగ్ చేయనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే ఆడనుండగా.. పేసర్లుగా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్ బరిలోకి దిగనున్నారు. రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిలకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.
సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్.
ఇంపాక్ట్ ప్లేయర్లు: టీ. నటరాజన్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్