For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH Playing XI: ఆ ఇద్దరిపై వేటు.. ఢిల్లీతో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌‌లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం వైజాగ్ వేదికగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌లో చేతిలో ఖంగుతిన్నది. ఈ ఓటమి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనతను బయట పెట్టింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయాన్నందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి జోష్‌లో ఉంది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాజస్థాన్ రాయల్స్‌తో పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. లక్నోతో తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా 190 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వైఫల్యం.. నితీష్ కుమార్ రెడ్డి జిడ్డు బ్యాటింగ్ సన్‌రైజర్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసాయి. అయితే ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడలేకపోయారు. నికోలస్ పూరన్ విధ్వంకర బ్యాటింగ్‌తో లక్నో సునాయస విజయాన్నందుకుంది. ఈ ఓటమి నుంచి గుణ పాఠం నేర్చుకున్న సన్‌రైజర్స్.. ఢిల్లీతో తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు.

SRH Playing XI vs DC for IPL 2025 Simarjeet Singh Out and Rahul Chahar IN

వ్యూహాత్మక మార్పులు..
వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌‌లోనూ పరుగుల వరద పారింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. డ్యూ ప్రభావం కూడా ఉండనుంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లు కొంత మేర ప్రభావం చూపారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. సిమర్జిత్ సింగ్ స్థానంలో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ను ఆడించవచ్చు. అభిషేక్ శర్మ, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు పంచుకుంటున్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రాహుల్‌ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడమ్ జంపా స్థానంలో కామిందు మెండీస్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి.

అభినవ్ మనోహర్‌పై వేటు..
తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన అభినవ్ మనోహర్‌ను కూడా తప్పించవచ్చు. ఫస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయిన మనోహర్..రెండో మ్యాచ్‌లో 2 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ అతన్ని తప్పించాలని భావిస్తే.. సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.

ఓపెనర్లలో ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. శతకంతో ఈ సీజన్‌ను ప్రారంభించిన ఇషాన్ కిషన్.. గత మ్యాచ్‌లో డకౌటయ్యాడు. అతను నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్‌లు కూడా చెలరేగితే హైదరాబాద్‌కు తిరుగుండదు. గత మ్యాచ్‌లో యువప్లేయర్ అనికేత్ వర్మ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 5 భారీ సిక్సర్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బౌలింగ్ విభాగంలో షమీ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

ఢిల్లీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్/సచిన్ బేబీ/అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్/రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/ కామిందు మెండీస్

Story first published: Saturday, March 29, 2025, 17:38 [IST]
Other articles published on Mar 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+