Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI vs CSK: యార్కర్ల నట్టూ‌పై వేటు? చెన్నైతో ఆడే సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే!

కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం చెన్నై‌లో చెపాక్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది.

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పేలవ బ్యాటింగ్‌తో చేజార్చుకుంది. దాంతోనే చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఆ జట్టు భావిస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పటిష్టంగా కనిపిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు తప్పేలా లేదు.

T Natarajan faces Axe and Umran Malik set to Return

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం కాగా.. పేలవ బౌలింగ్, మిడిలార్డర్ వైఫల్యం కలవరపెడుతోంది. ముంబైతో మ్యాచ్‌ చివర్లో ధారళంగా పరుగులిచ్చుకోవడం.. బ్యాటింగ్ చివర్లో ధాటిగా ఆడలేకపోవడం సన్‌రైజర్స్ కొంపముంచింది. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్పులు చేయనుంది.

గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని కోసం యార్కర్ల కింగ్ నటరాజన్‌పై వేటు వేయనున్నారు. ముంబైతో ఓ వికెట్ తీసినప్పటికీ నటరాజన్ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేసే క్రమంలో ఫుల్‌టాస్‌లు వేస్తూ పరుగులు సమర్పించుకుంటున్నాడు.

మరోవైపు చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో లోకల్ భాయ్ వాషింగ్ట సుందర్, మాయంక్ మార్కండే జట్టులో కొనసాగనున్నారు. నటరాజన్‌కు కూడా ఇది హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ అతను పేలవ ఫామ్‌లో ఉండటం సమస్యగా మారింది. ఒకవేళ నట్టూను కొనసాగిస్తే మాత్రం ఉమ్రాన్ మాలిక్‌ బెంచ్‌కు పరిమితమవుతాడు.

బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రాణిస్తుండగా.. ఇతర బౌలర్లు ధారుణంగా విఫలమవుతున్నారు. మార్కో జాన్సెన్ వికెట్లు తీసినా.. పరుగులు కట్టడి చేయలేకపోతున్నాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో ప్రభావం చూపిన మాయంక్ మార్కండే గత మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. టాప్-5 బ్యాటర్లలో ఏ ముగ్గురు రాణించినా సన్‌రైజర్స్‌కు తిరుగుండదు.

ముంబైతో సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మాయంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ టీ నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్: అబ్దుల్ సమద్

Story first published: Thursday, April 20, 2023, 16:45 [IST]
Other articles published on Apr 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+