Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: ఆ బ్యాటర్‌పై వేటు.. సీఎస్‌కేతో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ముంబై ఇండియన్స్ వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలోనే 277 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. సన్‌రైజర్స్ విధ్వంసానికి ముంబై 31 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

SRH Playing XI vs CSK for IPL 2024 Rahul Tripathi likely to replace Mayank Agarwal

గెలుపే లక్ష్యంగా..
కానీ ఆ జోరును సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్‌లో చూపించలేకపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ విజయాల బాట పట్టడంపై ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టింది.

మయాంక్‌పై వేటు..
పటిష్టమైన చెన్నైని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీమ్ కాంబినేషన్‌లోనూ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు వేసి రాహుల్ త్రిపాఠిని ఆడించే అవకాశం ఉంది. అప్పుడు ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడు.

బౌలింగ్‌లో నటరాజన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దించనుంది. అవసరమైతే గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన జయదేవ్ ఉనాద్కత్‌పై వేటు కూడా వేయవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.

ఆ ఇద్దరికి నిరాశే.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు బరిలోకి దిగనున్నారు. దాంతో గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్‌లకు నిరాశే ఎదురవ్వనుంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే అభిషేక్ శర్మ తుది జట్టులో ఉండనుండగా.. బౌలింగ్ చేస్తే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడు.

అభిషేక్ శర్మ, నటరాజన్ లేదా ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్ సుందర్‌లను ఆరెంజ్ ఆర్మీ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోనుంది. పరిస్థితులకు తగ్గట్లు వీరిని బరిలోకి దించనుంది.

తెలుగోడికి అన్యాయమే..
లోయరార్డర్‌లో అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్ బ్యాటింగ్ చేయనున్నారు. గత మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబర్చారు.
స్పెషలిస్ట్ పేసర్‌గా భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే బరిలోకి దిగనున్నారు. తెలుగు తేజం నితీష్ కుమార్‌ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్/రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్/నటరాజన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు: వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Wednesday, April 3, 2024, 17:17 [IST]
Other articles published on Apr 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+