ఐపీఎల్ 2024 సీజన్‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం చెపాక్ మైదానం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది.
సంచలన బ్యాటింగ్‌తో వరుస విజయాలతో జోరు కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చేతిలో ఖంగుతిన్నది. పేలవ బ్యాటింగ్ ఆ జట్టు ఓటమిని శాసించింది.

ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని కమిన్స్ సేన పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో సొంతగడ్డపై ఖంగుతిన్న సీఎస్‌కే మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా జరగనుంది.
మార్క్‌రమ్ మామపై వేటు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ఎయిడెన్ మార్క్‌రమ్‌పై వేటు వేసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన మార్క్‌రమ్.. 18, 42*, 17, 50*, 0, 32*, 1, 7లతో 175 పరుగులే చేశాడు.
ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటం.. గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోనుండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కూడా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. నటరాజన్, ట్రావిస్ హెడ్‌ల్లో ఒకరు తుది జట్టులో ఉంటే మరొకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నారు.
ఆరెంజ్ ఆర్మీదే గెలుపు..
ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్/గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కత్/వాషింగ్టన్ సుందర్
ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్