For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఓపెనర్లుగా కేన్ మామ, అభిషేక్.. మార్కో జాన్సన్ డౌట్! ఆర్‌ఆర్‌తో బరిలోకి దిగే సన్‌రైజర్స్ టీమ్ ఇదే!

SRH Playing 11 vs RR: Kane Williamson In And Marco Jansen Doubt For IPL 2022

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది. ముఖ్యంగా తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో పుణే వేదికగా జరగనున్న ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్ పరాభావాన్ని మరిచి.. అభిమానుల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా కేన్ విలియమ్సన్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ బరిలోకి దిగుతుంది. ఫ్రాంచైజీకే వన్నె తెచ్చిన డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌లతో పాటు జానీ బెయిర్ స్టో వంటి ఆటగాళ్లను దూరం చేసుకున్న సన్‌రైజర్స్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, కేన్‌మామ..

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, కేన్‌మామ..

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆ స్థాయి ఓపెనర్లను మాత్రం కొనుగోలు చేయలేకపోయింది. దాంతో కెప్టెన్ కేన్ మామ, యువ ప్లేయర్ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. నెమ్మదిగా ఆడే కేన్ మామ.. క్రీజులో కుదురుకుంటే విలువైన పరుగులు చేయగలడు. 2018 సీజన్‌లో కేన్ ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఒకవేళ కేన్ ఫస్ట్ డౌన్‌లో ఆడాలనుకుంటే రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.

మిడిలార్డర్‌లో అబ్దుల్ సమద్, మార్కరమ్, పూరన్..

మిడిలార్డర్‌లో అబ్దుల్ సమద్, మార్కరమ్, పూరన్..

ఇక కేన్ ఓపెనర్‌గా వస్తే రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్‌లో రానున్నాడు. గతంలో కేకేఆర్ తరఫున రాహుల్ త్రిపాఠి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంతేకాకుండా అతను నిలకడగా రాణించగలడు. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఎయిడన్ మార్కరమ్ ఆడనున్నాడు. అతని అనుభవం జట్టుకు కలిసిరానుంది. ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఆడనున్నాడు. అతను ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఆరో స్థానంలో హిట్టర్ అబ్దుల్ సమద్ బరిలోకి దిగనున్నాడు. అతను భారీ షాట్లు ఆడగలడు.

స్పిన్ ఆల్‌రౌండర్లుగా సుంధర్, శ్రేయస్ గోపాల్..

స్పిన్ ఆల్‌రౌండర్లుగా సుంధర్, శ్రేయస్ గోపాల్..

ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవాలనుకుంటే వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ గోపాల్ తీసుకోనున్నారు. గత సీజన్ వరకు ఆర్‌సీబీ తరఫున ఆడిన సుంధర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతని అనుభవం జట్టుకు కలిసిరానుంది. శ్రేయస్ గోపాల్ కూడా అనుభవం గల ఆల్‌రౌండరే. అయితే పేస్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే మార్కో జాన్సెన్, రొమారియో షెఫర్డ్‌లో ఒకరు ఆడనున్నారు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రొమారియో షెఫర్డ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.

పేసర్లుగా భువీ, ఉమ్రాన్, నటరాజన్..

పేసర్లుగా భువీ, ఉమ్రాన్, నటరాజన్..

ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌లతో కూడిన పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించనున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి భువీ సన్‌రైజర్స్‌కు ఆడుతున్నాడు. పైగా ఇటీవలే అతను రిథమ్ అందుకున్నాడు. ఇక సన్‌రైజర్స్‌తోనే తన సత్తా చాటుకున్న నటరాజన్ మరోసారి అలాంటి ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నాడు. ఇక నెట్ బౌలర్‌గా జట్టులోకి వచ్చిన అత్యంత వేగవంతమైన బంతులతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ కూడా బరిలోకి దిగనున్నాడు. అతని వేగం జట్టుకు ఉపయోగపడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్ రమ్, నికోలస్ పూరన్(కీపర్), అబ్డుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్/రొమారియో షెఫర్డ్/ శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Monday, March 28, 2022, 23:30 [IST]
Other articles published on Mar 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+