Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: నటరాజన్‌పై వేటు.. శ్రేయాస్ గోపాల్‌కు చాన్స్! లక్నోతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ టీమ్ ఇదే!

SRH Playing 11 vs LSG: Shreyas Gopal likely to replace T Natarajan

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా సోమవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. రాజస్థాన్ రాయల్స్‌తో పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఒక్క మార్పుతో...

ఒక్క మార్పుతో...

ముంబైలోని డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో సన్‌రైజర్స్ తుది జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకోనుంది. ఇరు జట్లకు ఈ మైదానంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. ఈ వికెట్ స్పిన్‌కు అనుకూలించనుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు చేజింగ్ టీమ్ గెలిచింది. డ్యూ ప్రభావం ఉండటంతో పాటు బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఈ వికెట్ కండీషన్స్ బట్టి సన్‌రైజర్స్ టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఈ లెక్కన గత జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకునే చాన్స్ ఉంది.

నటరాజన్‌పై వేటు..

నటరాజన్‌పై వేటు..

గత మ్యాచ్‌లో ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఇద్దరితో ఆడే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్‌కు తోడుగా శ్రేయస్ గోపాల్‌కు అవకాశం దక్కనుంది. అదే జరిగితే తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన నటరాజన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది. గాయంతో రిథమ్ కోల్పోయిన నటరాజన్ ఒకప్పటిలా యార్కర్లు సంధించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఒకవేళ నటరాజన్ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఉమ్రాన్ మాలిక్‌పై వేటు పడవచ్చు.

ఓపెనర్లుగా కేన్, అభిషేక్..

ఓపెనర్లుగా కేన్, అభిషేక్..

స్పెషలిస్ట్ ఓపెనర్లు జట్టులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మలతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ ఈ జోడీ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. అంపైర్ తప్పుడు నిర్ణయానికి కేన్ విలియమ్సన్ ఔటవ్వగా.. అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో రూ. 6.25 కోట్ల భారీ ధరకు అతన్ని తీసుకున్నప్పటికీ... ఆ అంచనాలను 10 శాతం కూడా అందుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఈ కాంబినేషన్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఫస్ట్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, నాలుగో స్థానంలో నికోలస్ పూరన్ రానున్నారు. ఈ ఇద్దరూ తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు.

వాషింగ్టన్‌కు ప్రమోషన్..

వాషింగ్టన్‌కు ప్రమోషన్..

ఐదో స్థానంలో ఎయిడెన్ మార్క్‌రమ్ ఆడనుండగా.. ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో జట్టు గౌరవాన్ని కాపాడిన ఈ ఇద్దరికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ కూడా దొరికే అవకాశం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా వీరిని అప్‌ది ఆర్డర్ కూడా ఆడించవచ్చు. ఇక అబ్డుల్ సమద్ ఏడో స్థానంలో ఆడనుండగా.. పేస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫెర్డ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. షెఫెర్డ్ బదులు మార్కో జాన్సెన్‌ను ఆడించే అవకాశం కూడా ఉంది. భువనేశ్వర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్/మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్/శ్రేయస్ గోపాల్

Story first published: Sunday, April 3, 2022, 19:20 [IST]
Other articles published on Apr 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+