Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: వాషింగ్టన్ సుందర్ దూరం.. శ్రేయాస్ గోపాల్‌కు చాన్స్! కోల్‌కతాతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ టీమ్ ఇదే!

SRH Playing 11 vs KKR: Shreyas Gopal likely to replace Washington Sundar

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు విజయాలందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. నేడు(శుక్రవారం) బ్రాబౌర్న్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌‌తో పరాజయంపాలైన సన్‌రైజర్స్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌, నయా టీమ్ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయాన్నందుకుంది. అయితే పేపర్‌పై కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీకంటే బలంగా కనిపిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్టులో ఒక్క మార్పు..

జట్టులో ఒక్క మార్పు..

గత మ్యాచ్‌లో గాయపడ్డ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దాంతో అతని సేవలను సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్పోయింది. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్‌లో శ్రేయస్ గోపాల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్, అబ్దుల్ సమద్ ఉన్నారు. అయితే కాస్తో కూస్తో అనుభవం ఉన్న శ్రేయస్ గోపాల్‌కే చోటు దక్కవచ్చు. అబ్దుల్ సమద్ ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టేసింది.

సీన్ అబాట్ డౌట్..

సీన్ అబాట్ డౌట్..

సుంధర్ ప్లేస్ మినహా మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. బ్యాటింగ్ డెప్త్ కోసం ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ సీన్ అబాట్ తీసుకోవానుకుంటే మాత్రం.. మార్కో జాన్సెన్‌పై వేటు పడుతుంది. ఇక వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ధారళంగా పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్‌.. గుజరాత్‌తో రాణించాడు. అతనికి టీమ్ మేనేజ్‌మెంట్ మరింత అండగా ఉంటూ గొప్ప పేసర్‌గా తయారు చేయాలనుకుంటుంది.

రాహుల్ త్రిపాఠికి గాయం...

రాహుల్ త్రిపాఠికి గాయం...

వేలంలో రూ.6.50 లక్షలు పెట్టి కొన్న అభిషేక్ శర్మ తన ధరకు న్యాయం చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్.. గుజరాత్ టైటాన్స్‌తోనూ ఫామ్ కొనసాగించాడు. దాంతో టీమ్ ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చే చాన్స్ లేదు. ఆరంభంలో విఫలమైన కేన్ విలియమ్సన్ కూడా ఫామ్ అందుకున్నాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌కు రానున్నాడు. గత మ్యాచ్‌లో క్రాంప్స్‌తో బాధపడ్డ అతను పూర్తిగా కోలుకున్నాడా? లేదో తెలియదు. నాలుగో స్థానంలో నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో మార్క్‌రమ్ ఆడనున్నాడు.

శశాంక్ సింగ్‌కు మరో చాన్స్..

శశాంక్ సింగ్‌కు మరో చాన్స్..

6వ స్థానంలో యువ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ ఆడనున్నాడు. చెన్నైతో మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి శశాంక్ సింగ్‌కు ఇప్పటి వరకు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్‌రమ్, శ్రేయస్ గోపాల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్/

సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

Story first published: Friday, April 15, 2022, 9:42 [IST]
Other articles published on Apr 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+