Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఉమ్రాన్ మాలిక్‌పై వేటు.. శ్రేయాస్ గోపాల్‌కు చాన్స్! గుజరాత్‌తో బరిలోకి దిగే సన్‌రైజర్స్ టీమ్ ఇదే!

SRH Playing 11 vs GT: Shreyas Gopal likely to replace Umran Malik

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత తొలి విజయాన్నందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. లీగ్‌లో ఇప్పటి వరకు ఓటమే ఎరుగని నయా టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. నేడు(సోమవారం) డీవై పాటిల్ మైదానం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌‌తో పరాజయంపాలైన సన్‌రైజర్స్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను సమష్టిగా రాణించి మట్టికరిపించింది. అయితే పేపర్‌పై గుజరాత్ టైటాన్స్.. ఆరెంజ్ ఆర్మీకంటే బలంగా కనిపిస్తోంది. పైగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు చివరి రెండు బంతులకు సిక్స్‌లు బాది విజయాన్నందుకుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జట్టులో ఒక్క మార్పు..

జట్టులో ఒక్క మార్పు..

గత మ్యాచ్‌లో విజయాన్నందుకోవడంతో విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చేందుకు కేన్ మామ ఇష్టపడకపోవచ్చు. కానీ ముంబైలోని డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం శ్రేయాస్ గోపాల్ జట్టులోకి వస్తాడు. సన్‌రైజర్స్‌కు ఈ మైదానంలో మూడో మ్యాచ్ కాగా.. ఈ వికెట్ స్పిన్‌కు అనుకూలించనుంది. డ్యూ ప్రభావం ఉండటంతో పాటు బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ వికెట్ కండీషన్స్ బట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ స్పిన్నర్‌ను ఎంచుకునే చాన్సుంది.

ఉమ్రాన్ మాలిక్‌పై వేటు..

ఉమ్రాన్ మాలిక్‌పై వేటు..

గత మూడు మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్‌పై వేటు పడే అవకాశం ఉంది. శ్రేయాస్ గోపాల్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటేనే మాలిక్‌‌కు ఉద్వాసన పలకనుంది. లేకుంటే గత మ్యాచ్ విన్నింగ్ టీమే కొనసాగనుంది. ఇక ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బంతులు విసురుతూ రికార్డులు సృష్టిస్తున్నా.. జట్టుకు తీరని నష్టం చేస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు వేరియేషన్స్ లేకపోవడంతో బ్యాట్స్‌మెన్ అతని పేస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. దాంతో ఉమ్రాన్ మాలిక్ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అవుతున్నాడు.

అభిషేక్ శర్మ జోరు...

అభిషేక్ శర్మ జోరు...

వేలంలో రూ.6.50 లక్షలు పెట్టి కొన్న అభిషేక్ శర్మ తన ధరకు న్యాయం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో టీమ్ ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చే చాన్స్ లేదు. కేన్ విలియమ్సన్ నిదానంగా ఆడిన అభిషేక్ రాణించడంతో గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఈ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్‌కు రానున్నాడు. నాలుగో స్థానంలో నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో మార్క్‌రమ్ ఆడనున్నాడు.

శశాంక్ సింగ్‌కు మరో చాన్స్..

శశాంక్ సింగ్‌కు మరో చాన్స్..

6వ స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనుండగా.. ఏడో స్థానంలో యువ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ ఆడనున్నాడు. చెన్నైతో మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసి శశాంక్ సింగ్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టీ నటరాజన్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఉమ్రాన్ మాలిక్‌పై వేటు వేయకుంటే అతను కొనసాగనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ గోపాల్/ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

Story first published: Monday, April 11, 2022, 7:16 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+