IPL 2022: అభిషేక్ శర్మపై వేటు.. శ్రేయాస్ గోపాల్‌కు చాన్స్! చెన్నైతో బరిలోకి దిగే సన్‌రైజర్స్ టీమ్ ఇదే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. నేడు జరిగే డబుల్ హెడర్‌లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ మైదానం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3.30 గంటలకు) ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్‌తో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. లక్నో సూపర్ జెయింట్స్‌తో గెలిచే మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. మరోవైపు చెన్నై పేలవ ఆటతీరుతో కేకేఆర్, లక్నో, పంజాబ్ చేతిల్లో పరాజయం చవిచూసింది. ఇరు జట్లకు విజయం ఎంతో అవసరం. కాబట్టి దెబ్బ తిన్న పులుల్లా గెలుపుకోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది.

జట్టులో భారీ మార్పులు..
ముంబైలోని డీవై పాటిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌కు ఈ మైదానంలో రెండో మ్యాచ్ కాగా.. ఈ వికెట్ స్పిన్‌కు అనుకూలించనుంది. డ్యూ ప్రభావం ఉండటంతో పాటు బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ వికెట్ కండీషన్స్ బట్టి సన్‌రైజర్స్ టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఈ లెక్కన గత జట్టులో రెండు, మూడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

అభిషేక్ శర్మపై వేటు..
వేలంలో రూ.6.50 లక్షలు పెట్టి కొన్న అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఏ మాత్రం ప్రభావం చూపని ఈ యువ ఆటగాడిన పక్కనపెట్టి అతని స్థానంలో స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌ను ఆడించే చాన్సుంది. అప్పుడు రాహుల్ త్రిపాఠిని ఓపెనర్‌గా బరిలోకి దించనున్నారు. అభిషేక్ శర్మ.. పార్ట్ టైమ్ స్పిన్నర్ అయినప్పటికీ అతను పెద్దగా రాణించిందేం లేదు. ఇప్పటికే అభిమానులు అతనిపై పీకల్‌దాక కోపంలో ఉన్నారు. చెన్నైపై గతంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రియామ్ గార్గ్ పేరును కూడా పరిశీలించవచ్చు. అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఇతర ఆటగాళ్లు బలి కావాల్సి ఉంటుంది.

మార్కో జాన్సెన్‌కు చాన్స్..
పేస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను కూడా పక్కన పెట్టే చాన్సుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ విండీస్ వీరుడు పెద్దగా రాణించిందేం లేదు. బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్‌ను ఆడించవచ్చు. జాన్సెన్ జట్టులోకి వస్తే.. కేవలం పేస్ మాత్రమే వేస్తూ ధారళంగా పరుగులిస్తున్న ఉమ్రాన్ మాలిక్‌ను పక్కనపెట్టవచ్చు. అతని స్థానంలో శ్రేయస్ గోపాల్‌ను ఆడించి ప్రియామ్ గార్గ్ లేదా అభిషేక్ శర్మలను కొనసాగించవచ్చు.

ఓపెనర్లుగా మార్క్‌రమ్, త్రిపాఠి..
స్పెషలిస్ట్ ఓపెనర్లు జట్టులో లేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మలతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ ఈ జోడీ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. అభిషేక్ శర్మ పేలవ బ్యాటింగ్ కారణంగా విలియమ్సన్ ఔటవ్వాల్సి వస్తుంది. అభిషేక్‌ను తప్పిస్తే రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్‌ను ఓపెనర్లుగా పంపించే చాన్సుంది. కేన్ మామ మళ్లీ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్‌లు బరిలోకి దిగనున్నారు. ఇక అబ్డుల్ సమద్ ఏడో స్థానంలో ఆడనుండగా.. 8వ స్థానంలో మార్కో జాన్సెన్‌ను ఆడించే అవకాశం కూడా ఉంది. నటరాజన్, మార్కో జాన్సెన్‌తో భువనేశ్వర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ప్రియామ్ గార్గ్/అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ గోపాల్, నటరాజన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications