IPL 2021:బ్యాట్స్‌మన్ వైఫల్యంతో రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్..ఈ జట్టుతో బరిలోకి దిగితే మాత్రం విజయాలే!

హైదరాబాద్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2021లో వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులతో ఓటమిపాలై పూర్తిగా నిరాశపర్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి గెలుపు బాటలో పయనించినా.. మిడిలార్డర్ ముంచడంతో వార్నర్ సేనకు పరాజయం తప్పలేదు. 150 పరుగుల లక్ష్య ఛేదనలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. అంతకుముందు కోల్‌కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే కింది జట్టుతో బరిలోకి దిగితే మాత్రం సన్‌రైజర్స్ విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విశేషాలు ఓసారి చూద్దాం.

ఓపెనర్‌గా బెయిర్‌స్టో:
ఐపీఎల్ 2021లో ఆడిన రెండు మ్యాచుల్లో బ్యాట్స్‌మన్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. హైదరాబాద్ జట్టుకు ఓపెనింగ్ పెద్ద సమస్యగా మారింది. ఎప్పటిలా జానీ బెయిర్‌స్టోతో కాకుండా వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. కోల్‌కతాపై సాహా (7), వార్నర్ (3) ఇద్దరూ విఫలమయ్యారు. బెంగళూరుపై కూడా సాహా (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వార్నర్ జతగా బెయిర్‌స్టో ఓపెనింగ్ చేస్తే.. సన్‌రైజర్స్ జట్టుకు మంచి ఆరంభం దక్కే అవకాశం ఉంది.

మనీష్ ఔట్.. కేన్ ఇన్:
మూడో స్థానంలో మనీశ్ పాండే నెమ్మదిన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రెండు మ్యాచులలో ఎక్కువగా డాట్ బాల్స్ ఆడి సన్‌రైజర్స్ ఓటములకు ప్రధాన కారణం అయ్యాడు. ఒకవేళ మనీష్ వేగంగా ఆడుంటే ఫలితం మరోలా ఉండేది. వచ్చే మ్యాచులలో పాండేకు బదులుగా.. ప్రియం గార్గ్ లేదా విరాట్ సింగ్‌లలో ఒకరి అవకాశం ఇస్తే సరిపోతుంది. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తుది జట్టులో లేకపోవడం కూడా హైదరాబాద్ టీంకు పెద్ద మైనస్. నాలుగో స్థానంలో ఆడే కేన్.. పరుగులు చేస్తూ వికెట్లను అడ్డుకోవడం అతడి ప్రత్యేకత. విదేశీ కోటాలో అతడికి అవకాశం ఇస్తే.. మిడిల్ ఆర్డర్ బలోపెతం అవుతుంది.

శంకర్ బదులుగా జాదవ్:
ఇక వరుసగా విఫలం అవుతున్న విజయ్ శంకర్ బదులుగా.. జట్టులోకి కొత్తగా వచ్చిన కేదార్ జాదవ్‌ను అవకాశం ఇస్తే బాగుంటుంది. చెన్నై తరఫున మిడిల్ ఆర్డర్‌లో రాణించిన అనుభవం కూడా ఉంది. అవసరం అయితే ఫినిషర్ పాత్ర కూడా పోషించగలడు. హిట్టర్ అబ్దుల్ సమద్ ఉంటాడు. బౌలింగ్ విభాగంను భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, టీ నటరాజన్ మోస్తారు. పిచ్, పరిస్థితులని బట్టి షాబాజ్ నదీమ్ లేదా సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ లేదా సిద్దార్థ్ కౌల్‌లలో ఒకరికి అవకాశం ఇస్తే సరిపోతుంది.

సన్‌రైజర్స్ బరిలోకి దిగాల్సిన జట్టు:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్, ప్రియం గార్గ్/విరాట్ సింగ్, కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, టీ నటరాజన్, షాబాజ్ నదీమ్/సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్/ సిద్దార్థ్ కౌల్.
RR vs DC: స్టోక్స్ ఔట్.. ఆందోళనలో రాజస్థాన్! రాబాడ ఎంట్రీ.. మరింత జోష్‌లో ఢిల్లీ! తుది జట్లు ఇవే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications