
ఓపెనర్‌గా బట్లర్
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ జట్టుపై అద్భుత సెంచరీ చేసి మంచి జోష్ మీదున్నాడు. అయితే బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికీ దూరమవడం ఆ జట్టుని కలవరపెడుతోంది. స్టోక్స్ స్థానంలో జోస్ బట్లర్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. ఇక బట్లర్ స్థానంలో డేవిడ్ మిల్లర్ ఆడనున్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ రూపంలో మరో ఆప్షన్ కూడా శాంసన్‌కు అందుబాటులో ఉంది. ఇక మనన్ వోహ్రా, శివమ్ దూబే, రాహుల్ తెవాటియా నిలకడ రాణించాలని రాజస్థాన్ కోరుకుంటోంది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ బెరుకు లేకుండా హిట్టింగ్ చేస్తుండటం ఆ జట్టుకి ఉపశమనం. అవసరం అయితే క్రిస్ మోరీస్ కూడా తన బ్యాటుకు పనిచెప్పగలడు.

ఆశలు రేపుతున్న సకారియా
రాజస్థాన్ జట్టు బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తోంది. క్రిస్ మోరీస్ తొలి మ్యాచ్‌లో విఫలమయినా.. పుంజుకునే సత్తా అతడిలో ఉంది. యువ పేసర్ సకారియా ఆశలు రేపుతున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్, శ్రేయాస్ గోపాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సి ఉంది. పరాగ్ కూడా అందుబాటులో ఉన్నాడు. దూబే, తెవాటియా కూడా తలో చేయి వేయగలరు. గత మ్యాచులో కెప్టెన్ సంజు శాంసన్.. ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించాడు. అయితే ఒక ఓవర్ వేసి ఆకట్టుకున్న పరాగ్ చేత మరో ఓవర్ వేయించలేదు. ఇక ఫీల్డింగ్‌లోనూ రాజస్థాన్ మెరుగవ్వాల్సి ఉంది.

సూపర్ ఫామ్‌లో ఢిల్లీ ఓపెనర్లు
ఢిల్లీలో ఓపెనర్ శిఖర్ ధావన్, పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఎంత లక్ష్యం అయినా ఈ ఇద్దరమే ఊదెలా ఉన్నారు. ఓపెనర్లు ఆడడంతో షిమ్రాన్ హిట్‌మెయర్, రిషబ్ పంత్‌కి ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్, సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఉండనే ఉన్నారు. బౌలింగ్ పరంగా క్రిస్ వోక్స్, అవేష్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. అయితే వెటరన్ స్పిన్నర్లు ఆర్ అశ్విన్, అమిత్ మిశ్రాలు గాడిలో పడాల్సి ఉంది. క్వారంటైన్ కారణంగా మొదటి మ్యాచ్‌కి దూరమైన కగిసో రాబాడ.. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో టామ్ కరన్‌పై వేటు పడనుంది. కరోనా సోకడంతో స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ మరో 3-4 మ్యాచులకు అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోయింది.

రికార్డ్స్
ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఢిల్లీ, రాజస్థాన్ జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 2019 నుంచి రాజస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో తలపడిన ఢిల్లీ.. నాల్గింటిలోనూ విజయాలు అందుకుంది. ఢిల్లీపై రాజస్థాన్ ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 201 పరుగులుకాగా.. రాజస్థాన్‌పై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196.

తుది జట్లు (అంచనా)
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానే, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హిట్‌మెయర్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేష్ ఖాన్, అమిత్ మిశ్రా.
రాజస్థాన్: మనన్ వోహ్రా, జోస్ బట్లర్, సంజు శాంసన్, డేవిడ్ మిల్లర్/లియామ్ లివింగ్‌స్టోన్, శివం దూబే, రాహుల్ టెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.
డ్రీమ్ ఎలెవన్ టీం:
సంజు శాంసన్ (vc), రిషబ్ పంత్, శిఖర్ ధావన్ (c), మనన్ వోహ్రా, పృథ్వీ షా, షిమ్రాన్ హిట్‌మెయర్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ మోరిస్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, చేతన్ సకారియా.


Click it and Unblock the Notifications

SRH vs RCB: మనీష్ పాండే ఔట్.. కావ్య మారన్ రియాక్షన్ ఇది!!










