Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH బ్యాటర్ విధ్వంసం.. 9 సిక్సర్లతో వీర విహారం!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్.. అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో జార్ఖండ్ ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనుకూల్ రాయ్(4/17) నాలుగు వికెట్లు తీయగా.. రవి కుమార్ యాదవ్(3/12) మూడు వికెట్లు పడగొట్టాడు.

SRH player Ishan Kishan smacks unbeaten 77 off just 23 balls in Syed Mushtaq Ali Trophy

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్.. ఇషాన్ కిషన్ విధ్వంసంతో 4.3 ఓవర్లలోనే 94 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్ విధ్వంసంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఇషాన్ కిషన్.. అప్‌కమింగ్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అతను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ చేరికతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా మారింది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటర్లు ఉండగా.. ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు.

మిడిలార్డర్‌లో స్టార్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ ఆడనున్నాడు. లోయర్ మిడిలార్డర్‌లో అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రాహుల్ చాహర్, ఆడమ్ జంపా ఆడనుండగా.. మహమ్మద్ షమీ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్‌ సమతూకంగా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
మహ్మద్ షమి (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్‌ కిషన్‌ (రూ. 11.25 కోట్లు), అభినవ్ మనోహర్‌ (రూ. 3.20 కోట్లు), రాహుల్‌ చాహర్‌ (రూ. 3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్‌ (రూ. 1.50 కోట్లు), అథర్వ టైడ్ (రూ.30 లక్షలు), జీషాన్ అన్సారీ(రూ.40 లక్షలు), జయదేవ్ ఉనాద్కత్(రూ.1 కోటి), కమిందు మెండీస్(రూ.75 లక్షలు), అనికేత్ వర్మ(రూ.30 లక్షలు), బ్రిడన్ కార్స్(రూ. కోటి), అనికేత్ వర్మ(రూ. 30 లక్షలు), ఇషాన్ మలింగా(రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:

హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు)

Story first published: Friday, November 29, 2024, 20:51 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+