Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Umran Malik: భారత ప్రపంచకప్ జట్టులోకి సన్‌రైజర్స్ సర్‌ప్రైజ్ స్టార్!

 SRH Pacer Umran Malik selected as Team Indias net bowler

దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో బుల్లెట్లలాంటి బంతులతో అందరి దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సర్‌ప్రైజ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు ప్రమోషన్ దక్కింది. జమ్మూ కశ్మీర్‌కు బెందిన 21 ఏళ్ల ఈ యువ పేసర్ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. దాంతో, అతను యూఏఈలోనే జట్టుతో ఉండిపోనున్నాడు. నెట్‌ బౌలర్‌గా తను తొందర్లోనే భారత బయో బబుల్‌లో చేరుతాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. డొమెస్టిక్ సీనియర్ లెవెల్‌లో రెండే మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ జీవితం రెండు నెలల్లోనే పూర్తిగా మారిపోయింది.

అనూహ్యంగా జట్టులోకి వచ్చి..

అనూహ్యంగా జట్టులోకి వచ్చి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్‌గా యూఏఈ వెళ్లిన అతను.. కరోనా బారిన పడ్డ టీ నటరాజన్ స్థానంలో ప్రధాన జట్టులోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన ఉమ్రాన్.. రెండే వికెట్లు తీసినప్పటికీ నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. ఈ సీజన్‌‌లోనే అత్యధికంగా 153 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టిని ఆకర్షించాడు. ఆర్‌సీబీతో జరిగిన తన రెండో మ్యాచ్‌లో ఉమ్రాన్ వేగవంతమైన బంతులతో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. తనదైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కోహ్లీ ఫిదా..

కోహ్లీ ఫిదా..

ఉమ్రాన్ బౌలింగ్‌కు ముగ్దుడైన కోహ్లీ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఉమ్రాన్ లాంటి యువ ఆటగాడిపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డాడు. 'ప్రతీ ఏడాది ఐపీఎల్‌ ద్వారా ప్రతిభావంతులు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. ఈసారి 150 ప్లస్ వేగంతో బంతులు వేసే బౌలర్‌ను చూడటం బాగుంది. ఇలాంటి మంచి పేసర్లు రావడం భారత క్రికెట్‌కు శుభపరిణామం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ చొరవతోనే ఉమ్రాన్ నెట్ బౌలర్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 అరంగేట్ర మ్యాచ్‌లోనే..

అరంగేట్ర మ్యాచ్‌లోనే..

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఐపీఎల్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల ఉమ్రాన్‌ తన మొదటి బంతినే 146 కిలోమీటర్ల వేగంతో సందించాడు. ఆపై రెండు బంతులను 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ఇక ఆర్‌సీబీపై గంటకు 153 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బంతిని విసిరి ఐపీఎల్‌ 2021లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఆడుతున్న ఆర్‌సీబీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ (గంటకు 147.68కిమీ, 147.67కిమీ) రెండో స్థానంలో.. ఎస్‌ఆర్‌హెచ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్‌ అహ్మద్‌ (గంటకు 147.38కిమీ) మూడో స్థానంలో ఉన్నాడు.

అగ్రస్థానంలో అన్రిచ్‌ నోర్జ్‌..

అగ్రస్థానంలో అన్రిచ్‌ నోర్జ్‌..

ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్‌ నోర్జ్‌ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున ఆడుతున్న నోర్జ్‌.. ఐపీఎల్ 2020లో గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే ఫాస్టెస్ట్ బంతిని రాజస్థాన్‌ బ్యాటర్ జోస్ బట్లర్‌ బౌండరీకి తరలించాడు. నోర్జ్ ఆ తర్వాతి బంతిని కూడా 155.1 గంటకు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అప్పుడు బట్లర్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆ బంతికి అతడు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో మొదటి మూడు వేగవంతమైన బంతులు (156.2, 155.21, 154.74) నోర్జ్‌ పేరిటే ఉన్నాయి. డేల్‌ స్టెయిన్‌ (154.4 గంటకు కిలోమీటర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఉమ్రాన్‌ మాలిక్‌ మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్తాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ (150) టాప్-5 ఉన్నాడు.

Story first published: Sunday, October 10, 2021, 8:20 [IST]
Other articles published on Oct 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+