Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బోణీ కొట్టిన కావ్య పాప!

ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌కు చెందిన నార్తర్న్ సూపర్‌ చార్జర్స్ బోణీ కొట్టింది. గురువారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది.

ఓపెనర్ జానీ బెయిర్ స్టో(23 బంతుల్లో 7 ఫోర్లతో 42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్ స్టీవ్ స్మిత్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) పర్వాలేదనిపించాడు. సూపర్‌చార్జర్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, మాథ్యూ పోట్స్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ అమీర్, టామ్ లాస్ తలో వికెట్ తీసారు.

SRH Owner Kavya Maran s Northern Superchargers Beat Welsh Fire By 8 Wickets In The Hundred 2025

అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 89 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జాక్ క్రాలీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మలన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), కెప్టెన్ హ్యారీ బ్రూక్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో రిలే మెరిడిత్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇండియా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా ఉన్న కావ్య మారన్.. తన ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని ఇంగ్లండ్ వరకు విస్తరించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న "ది హండ్రెడ్" క్రికెట్ టోర్నీలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును సన్ టీవీ నెట్‌వర్క్ రూ.1,161(100.5 మిలియన్ పౌండ్లు) కోట్లకు కొనుగోలు చేసింది. సన్‌ నెట్‌వర్క్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఉంది.

తాజాగా ఈ జాబితాలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ చేరింది. ఈ మూడు జట్లను కావ్య పాపనే చూసుకుంటుంది. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తుండగా.. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Friday, August 8, 2025, 12:03 [IST]
Other articles published on Aug 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+