Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Retention: కేన్ మామ, నికోలస్ పూరన్‌పై వేటు వేసిన కావ్యపాప.. సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్ ఇదే!

SRH IPL 2023 Retention List: Orange Army axe Kane Williamson and Pooran

హైదరాబాద్: ఊహించినట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు నికోలస్ పూరన్‌పై వేటు వేసింది. ఐపీఎల్ 2023 రిటెన్షన్ ప్రక్రియకు నేటి(నవంబర్ 15) సాయంత్ర 5 గంటలకు గడువు ముగియడంతో తమ జాబితాను ప్రకటించింది. ఐపీఎల్ 2023 కోసం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగతావారిని వేలంలోకి వదిలిపెట్టింది.

ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీలను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్.. కేన్ మామతో పాటు నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్‌లను వదిలేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ అకౌంట్స్‌లో రెండు ట్వీట్స్ చేసింది. ఒకదాంట్లో రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.. మరో ట్వీట్‌లో కేన్ విలియమ్సన్‌కు ధన్యావాదాలు తెలిపింది. కేన్ మామ ఎప్పటికీ మనవాడే అంటూ క్యాప్షనిచ్చింది. మళ్లీ వేలంలో తక్కువ ధరకు తీసుకునే ప్రయత్నం చేస్తామని హింట్ ఇచ్చింది.

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు రూ.14 కోట్ల భారీ ధరకు కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కేన్ మామ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వదులుకోవడమే ఉత్తమని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. తక్కువ ధరకు లభిస్తే మళ్లీ కొనుగోలు చేసే ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో కేన్ మామ తడబడుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

రూ.10.75 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర నికోలస్ పూరన్‌తో కూడా జట్టుకు ఒరిగినది ఏం లేదు. అతను కూడా జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. రూ.7.75 కోట్లకు తీసుకున్న రొమారియో షెఫార్డ్ సైతం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. దాంతో అతన్ని కూడా జట్టు వదులుకుంది. ఈ ముగ్గురిని వదిలేయడం ద్వారా సన్‌రైజర్స్ పర్స్‌కు రూ. 32.5 కోట్లు యాడ్ అయ్యాయి. మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.

Story first published: Tuesday, November 15, 2022, 18:55 [IST]
Other articles published on Nov 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+