SRH Intra-squad Match: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే అర్థ శతకం!
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముమ్మరంగా సాధన చేస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఈ మ్యాచ్‌లో తలపడ్డారు. ఈ సన్నాహక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉ టీమ్ తరఫున 30 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఓవర్లు పూర్తయిన తర్వాత ఔటవ్వకుండానే బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటు అభినవ్ మనోహర్, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటంతో SRH-A టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. SRH బీ టీమ్ సైతం.. ధీటుగా బదులిచ్చింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఉప్పల్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ ఆటగాళ్లంతా జట్టుతో చేరి ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలవనున్నాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో ఆటకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) బెంగళూరులో రిహాబిలిటేషన్ తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు. యో-యో టెస్ట్‌లో 18.1 స్కోర్ నమోదు చేయడంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ట్రావిస్ హెడ్ కూడా మరో రెండు, మూడు రోజుల్లో జట్టుతో కలవనున్నారు.
Ishan Kishan scored a half-century in just 16 balls during SRH's intra-squad match😎📸💥@ishankishan51 #IshanKishan #SRH #IPL2025 #PlayWithFire pic.twitter.com/Vc1UiJAEZM
— Ishan's🤫🧘🧡 (@IshanWK32) March 15, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications