Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కష్టాల్లో కావ్య మారన్?

సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) ఓనర్ కావ్యమారన్ ఇబ్బందుల్లో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కావ్య మారన్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు చెందిన సన్‌ టీవీ నెట్‌వర్క్ వాటాల వివాదమే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది.

కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులను పంపారు. తమ తండ్రి మురసొలి మారన్ మరణం తర్వాత సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లను కళానిధి మారన్ అక్రమంగా బదిలీ చేసుకున్నారని దయానిధి మారన్ ఆరోపించారు. ళానిధి మారన్ మనీలాండరింగ్, ఇతర మోసపూరిత ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొన్నారు.

SRH in Trouble Dayanidhi Maran s Notices Impact Kavya Maran s Team

మా అన్న మోసం చేశాడు..

తమ తండ్రి మరణం తర్వాత సన్ టీవీ గ్రూప్‌ను మోసపూరితంగా చేజిక్కించుకున్నారని, సంస్థలో వాటాల పంపకాలను 2003 నాటి స్థితికి తీసుకురావాలని దయానిధి మారన్ డిమాండ్ చేశారు.
కళానిధి మారన్‌తో పాటు ఆయన భార్య కావేరి మారన్‌కు ఈ నోటీసులను దయానిధి మారన్ పంపారు.

సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీసు ఆ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు నోటీసులో పేర్కొన్నారు. తండ్రి ముర‌సోలీ మార‌న్ 2003లో మృతిచెందారు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన స‌న్ టీవీ షేర్లు అప్ప‌గింత‌లో వివాదం నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది.

సమగ్ర విచారణ జరపాలి..

వీలునామా రాయ‌కుండానే తండ్రి చ‌నిపోయార‌ని, అందుకే 2003 నాటి ప్ర‌కారం షేర్ల పంప‌కం జ‌ర‌గాల‌ని దయానిధి మారన్ కోరుతున్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO)తో సహా సెబీ, ఆర్బీఐ, ఈడీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు ఈ విచార‌ణ‌లో పాల్గొనాల‌ని తాను పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వివాదం మారన్ కుటుంబంలో అంతర్గత కలహాలను బహిర్గతం చేసింది. దయానిధి ఆరోపణలను సన్‌ టీవీ నెట్‌వర్క్ ఖండించింది. సన్‌ టీవీ నెట్‌వర్క్ వాటాల పంపిణీ విషయంలో చట్టపరమైన నిబంధనలు పాటించామని స్పష్టం చేశారు.

సన్‌నెట్‌ వర్క్ కంపెనీలో క‌ళానిధి మార‌న్‌కు 75 శాతం వాటా ఉంది. మార్కెట్ విలువ దాదాపు రూ. 25 వేల కోట్లు ఉంటుంది. స‌న్ టీవీ నెట్వర్క్ లో త‌మిళం, తెలుగు, హిందీ, బెంగాలీ భాష‌లకు చెందిన ఛానెల్స్‌తో పాటు ఎఫ్ఎం రేడియో స్టేష‌న్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే ఉంది.ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు కావ్య మారన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంతర్గత కలహాల కారణంగా సన్‌టీవీ నెట్ వర్ష్ షేర్లు 4 శాతం పతనమయ్యాయి.

Story first published: Friday, June 20, 2025, 22:38 [IST]
Other articles published on Jun 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+