Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తీవ్రంగా నిరాశపర్చింది. వై నాట్ 300 అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటి దారిపట్టింది. తమకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. చివర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయం సాధించినా టోర్నీలో ముందుడుగు వేయలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 గెలవడంతో పాటు ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకొని 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ‌లు తీవ్రంగా నిరాశపర్చారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, జీషన్ అన్సారీల వైఫల్యం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. డిసెంబర్ చివరి వారంలో ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. నవంబర్ 15లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంటుంది.

SRH in Spotlight as Retain and Release List Sparks Debate Ahead of IPL 2026 Mini Auction

ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్ట్‌లపై ఫోకస్ పెట్టాయి. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలేసే ఆటగాళ్లను వదిలేయనుంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా‌లను సన్‌రైజర్స్ వదులుకునే ఛాన్స్ ఉంది. ఈ ఐదుగురు ఆటగాళ్లు జట్టుకు భారంగా మారారు.

రూ. 10 కోట్లు పెట్టిన కొన్న మహమ్మద్ షమీ కనీసం 10 వికెట్లు కూడా తీయలేదు. 9 మ్యాచ్‌లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. రూ. 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాహుల్ చాహర్‌, రూ. 2.40 కోట్లకు తీసుకున్న ఆడమ్ జంపా‌లు కూడా జట్టు అంచనాలను అందుకోలేకపోయారు. ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రెండు మ్యాచ్‌లు ఆడి రెండే వికెట్లు తీసాడు. పేలవ ఫామ్‌తో రాహుల్‌ చాహర్‌కు తుది జట్టులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన కనబర్చినా.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు. రూ.3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా తీవ్రంగా నిరాశర్చాడు. 8 మ్యాచ్‌ల్లో 12.20 స్ట్రైక్‌రేట్‌తో 61 పరుగులు చేశాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసే ఆటగాళ్ల జాబితా:

మహమ్మద్ షమీ(రూ.10 కోట్లు), రాహుల్ చాహర్(రూ.3.20 కోట్లు), ఆడమ్ జంపా(రూ.2.4 కోట్లు), జీషన్ అన్సారీ(రూ.40 లక్షలు), అభినవ్ మనోహర్(రూ.3.20 కోట్లు)

సన్‌రైజర్స్ రిటైన్ చేసుకునే జాబితా ఇదే:

హెన్రీచ్ క్లాసెన్(రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్‌ కిషన్‌ (రూ. 11.25 కోట్లు), సిమర్‌జీత్ సింగ్‌ (రూ. 1.50 కోట్లు), అథర్వ టైడ్ (రూ.30 లక్షలు), జయదేవ్ ఉనాద్కత్(రూ.1 కోటి), కమిందు మెండీస్(రూ.75 లక్షలు), అనికేత్ వర్మ(రూ.30 లక్షలు), బ్రైడన్ కార్స్(రూ. కోటి), అనికేత్ వర్మ(రూ. 30 లక్షలు), ఇషాన్ మలింగా(రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు)

Story first published: Monday, November 10, 2025, 17:48 [IST]
Other articles published on Nov 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+