Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: డేంజర్ జోన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ మ్యాచ్ ఓడితే అస్సామే!

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. దాంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. మ్యాచ్ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలయ్యాయి.

వరుస పరాజయాలతో చతికిలపడిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్‌కే మళ్లీ విజయాల బాట పట్టి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి కేకేఆర్, ముంబై ఇండియన్స్ ఆశలు రేకెత్తించాయి. లక్నో సూపర్ జెయింట్స్‌కు కూడా అవకాశం ఉండటంతో ఇప్పటి వరకు ఏ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించుకోలేదు.

ఆ రెండు జట్లకు మినహా..

ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మినహా మిగతా జట్లకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ తమ చివరి ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలవాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఐదింటిలో నాలుగు గెలవాలి.

SRH in Danger Zone Why 6 Wins in 10 Games Might Not Be Enough for Sunrisers Hyderabad in IPL 2026

పాయింట్ల పట్టికలో చివరి 3 స్థానాల్లో ఉన్న LSG, MI, KKRకి చావోరేవో పరిస్థితి నెలకొంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే ఇకపై లక్నో మిగిలిన ఐదు, ముంబై 4 మ్యాచులనూ గెలవడమే కాకుండా ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాలి. KKR మరో 5 మ్యాచుల్లో విజయం సాధించాలి.

డేంజర్ జోన్‌లో SRH

వరుసగా 5 విజయాలతో జోరు కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనూహ్యంగా బలహీనమైన కేకేఆర్ చేతిలో ఓటమి చవిచూసింది. అది కూడా ఆరెంజ్ ఆర్మీ అచ్చొచ్చిన సొంత మైదానంలో పరాజయాన్ని ఎదుర్కొంది. గుడ్డిగా బ్యాటింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో SRHకు వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 విజయాలు, 4 ఓటములతో 12 పాయింట్స్ సాధించింది. రన్‌రేట్(0.644) కూడా మెరుగ్గానే ఉంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 4 మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. అప్పుడు 8 విజయాలు, 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తోంది.

3 విజయాలు సాధిస్తే ఏ సమీకరణంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి నాలుగు మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే, ఆర్‌సీబీ‌తో తలపడనుంది. ఇందులో రెండు హోమ్ మ్యాచ్‌లు(పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ) ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ నాలుగు టీమ్స్‌ పటిష్టంగా ఉండటం సన్‌రైజర్స్ అభిమానులను కలవరపెడుతోంది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడిస్తే ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. లేదంటే సన్‌రైజర్స్ డేంజర్ జోన్‌లో నిలుస్తోంది.

Story first published: Tuesday, May 5, 2026, 12:52 [IST]
Other articles published on May 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+