For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసం.. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ! (వీడియో)

లండన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్ కాక.. బుధవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

27 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు. బంతి ఎలా వేసినా స్టేడియం బయటకు పంపించాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని ది హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ ఫీఫ్టీ రికార్డు అందుకున్నాడు. క్లాసెన్ సూపర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది.

SRH hitter Heinrich Klaasen smashes Hundreds fastest 50 Just 23 balls

క్లాసెన్‌తో పాటు జాసన్ రాయ్(42 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, జోష్ లిటిల్, పాల్ వాల్టర్ తలో వికెట్ తీసారు. జామియా ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాంచెస్టర్ ఓరిజినల్స్ టీమ్.. 89 బంతుల్లో 92 పరుగులకే కుప్పకూలి 94 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవి చూసింది.

ఓవల్ ఇన్విన్సిబుల్ టీమ్ విధించిన 186 పరుగుల లక్ష్యంలో సగం పరుగులు కూడా చేయలేకపోయింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్‌లో జామియా ఓవర్టన్(37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓవల్ ఇన్విన్సిబుల్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, సునీల్ నరైన మూడేసి వికెట్లతో చెలరేగగా.. నాథన్ సౌటర్, అట్కిన్సన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

క్లాసెన్ సూపర్ ఫామ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను సంతోషపరుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ క్లాసెన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. జట్ట మొత్తం విఫలమైనా తన ఊర మాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 448 పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్లు విఫలమవడంతో సన్‌రైజర్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

Story first published: Thursday, August 10, 2023, 13:22 [IST]
Other articles published on Aug 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+