Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 SRH : పాపం కావ్య పాప.. రూ. 23 కోట్లు దండగేనా? దారుణంగా విఫలమవుతున్న క్లాసెన్ కాక!

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. సొంత ఫ్రాంచైజీ లీగ్ అయిన సౌతాఫ్రికా 20లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీచ్ క్లాసెన్ గత 4 మ్యాచ్‌ల్లో(0, 29, 1, 8) 38 పరుగులు మాత్రమే చేశాడు.

దాంతో ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. క్లాసెన్ పేలవ ఫామ్ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే అతని పేలవ ఆట తీరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రీచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

SRH Fans Worried For Rs 23 Crore Player Heinrich Klaasen s Dry T20 Run Ahead of IPL 2025

రూ. 23 కోట్ల భారీ ధర..
రిటెన్షన్ ప్రక్రియలో క్లాసెన్‌కే సన్‌రైజర్స్ అత్యధిక ధరను వెచ్చించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ ప్లేయర్ హెన్రీచ్ క్లాసెన్. గత రెండు సీజన్లలో క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఇతర ఆటగాళ్లంతా విఫలమైనా.. ఒంటిచేత్తో విజయాలు అందించాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్.. హెన్రీచ్ క్లాసెన్‌‌ను రూ. 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. అలాంటి క్లాసెన్ ఉన్నట్టుండి ఒక్కసారి ఫామ్‌ కోల్పోయాడు. సౌతాఫ్రికా 20లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. సొంత లీగ్‌లోనే విఫలమవుతుంటే మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సమయానికి ఫామ్‌లోకి వస్తాడా? మునపటిలా రాణిస్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాక విఫలమైతే పెద్ద బొక్కే..
హెన్రీచ్ క్లాసెన్ అంచనాలకు తగ్గట్లు రాణించకపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నష్టం జరగుతోంది. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. క్లాసెన్‌తో పాటు ప్యాట్ కమిన్స్(రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ(రూ. 14 కోట్లు), ట్రావిస్ హెడ్(రూ. 14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి(రూ. 6 కోట్లు)ల కోసమే సన్‌రైజర్స్ రూ. 75 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఐదు గురి ఆటగాళ్లను టీమ్ పిల్లర్స్‌గా భావించి జట్టును నిర్మించింది. ఈ ఐదుగురిలో ఒక్కరు విఫలమైనా.. సన్‌రైజర్స్ టీమ్ కుప్పకూలుతోంది.

Story first published: Monday, January 20, 2025, 20:52 [IST]
Other articles published on Jan 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+