For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: డేవిడ్ వార్నర్‌ పోయే.. ఇక లైన్‌లో ఉంది రషీద్ ఖానే! సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్.. ఆ తర్వాత ఎవరు?!

SRH Fans troll Sunrisers Hyderabad management on Twitter after sacking skipper David Warner

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ శనివారం సంచలన నిర్ణయం తీసుకుంది. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ సారథిగా కొనసాగుతాడని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. తాజా సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇటీవల చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో బ్యాటింగ్‌‌తో నిరాశపరిచిన వార్నర్.. మ్యాచ్‌ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతలోనే అతని కెప్టెన్సీపై వేటు పడింది.

ప్రదర్శన ఒక్కటే కారణమా

ప్రదర్శన ఒక్కటే కారణమా

ఐపీఎల్ 2021లో కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించలేకపోతున్న డేవిడ్ వార్నర్‌.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమవుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లో వరుసగా 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేశాడు. ఈ గణాంకాల పరంగా చూస్తే అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా లేదు. ప్రాంచైజీ ఆశించిన స్థాయిలో మాత్రం వార్నర్ రాణించట్లేదు. అయితే కేవలం కెప్టెన్సీ వైఫల్యం, బ్యాట్స్‌మన్‌గా పరుగులు చేయకపోవడంతోనే అతణ్ని సారథిగా తొలగించారని చెప్పలేం. ఎందుకంటే గతంలోనూ జట్టు ఇలా వెనకబడ్డపుడు.. తన మార్క్ నాయకత్వంతో, బ్యాటింగ్‌తో తిరిగి విజయాల బాట పట్టించాడు. ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ప్రదర్శన ఒక్కటే కారణం కాదని.. మేనేజ్‌మెంట్‌తో ఉన్న విభేధాలు కూడా కారణమని సమాచారం తెలుస్తోంది.

CSK vs MI: రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన చెన్నై-ముంబై మ్యాచ్.. ఎంతమంది వీక్షించారంటే?

ఇంత చేసినా

డేవిడ్ వార్నర్‌ 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో చేరాడు. 2015లో జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇక 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అదే ఏకైక టైటిల్‌. ఆ తర్వాతి ఏడాది ప్లేఆఫ్స్‌ చేర్చాడు. బాల్‌ టాంపరింగ్‌ నిషేధం కారణంగా 2018 సీజన్‌కు దూరమయ్యాడు. 2019లో ఆటగాడిగానే కొనసాగినా.. తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని మరోసారి సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్‌ తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు (5447) చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానం వార్నర్‌దే. మెగా టోర్నీలో 50 అర్ధ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ అతడే. 2014 నుంచి ఆడిన ప్రతి సీజన్‌లోనూ కనీసం 500 పరుగులు చేస్తున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ (2015, 2017, 2019) అందుకున్న ఆటగాడూ కూడా.

సంక్లిష్టంగానే ప్లేఆఫ్‌ అవకాశాలు

ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే విజయం అందుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే.. ఆడబోయే ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట్లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ ఆరు గెలిచినా.. మిగతా జట్ల విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పించి ఆ భారాన్ని కేన్ విలియమ్సన్‌పై మోపడం ఏ మేరకు సమంజసమో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఓటముల బాధలో ఉన్న జట్టుకు.. ఈ పరిణామం మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు.

రషీద్ ఖాన్‌ను కూడా రిలీజ్ చేస్తారు

ఒకసారి కప్ అందించి, మూడు సార్లు ప్లేఆఫ్‌కు తీసుకెళ్లిన డేవిడ్ వార్నర్‌ను నాయకత్వ హోదా నుంచి తొలగించడం సన్‌రైజర్స్‌ అభిమానులకు మింగుడుపడడం లేదు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'వార్నర్‌కు 1-2 మ్యాచులో రెస్ట్ ఇస్తే ఒకే.. జట్టులోని ఉండడంటే ఊరుకోము' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వార్నర్‌నే పీకేశారు.. రషీద్ ఖాన్‌ను కూడా రిలీజ్ చేసినా చేస్తారు' అని ఇంకొకరు అన్నారు. 'సన్‌రైజర్స్‌ మేనేజ్మెంట్.. ఆ తర్వాత ఎవరు?', 'వార్నర్‌ను అవమానించారు', 'వార్నర్‌ను వెన్నుపోటు పొడిచారు', 'జట్టు కోచ్ లక్షణ్, టామ్ మూడీల పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది', 'మీ నిర్ణయానికి సిగ్గుపడుతున్నాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Sunday, May 2, 2021, 11:09 [IST]
Other articles published on May 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+