For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన చెన్నై-ముంబై మ్యాచ్.. ఎంతమంది వీక్షించారంటే?

IPL 2021: Highest viewers for MI vs CSK match on Hotstar so far
IPL 2021, MI vs CSK Highlights : Kieron Pollard's 34 - Ball 87 Runs | Oneindia telugu

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు టాప్ జట్ల మధ్య సిక్సులు, బౌండరీల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల కన్నా ఈ మ్యాచ్ అత్యధిక వ్యూయర్‌షిప్‌ను సాధించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 8.4 మిలియన్ల మంది ఈ మ్యాచ్ లైవ్‌ను వీక్షించారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సిక్సులు వర్షం కురిసింది. చెన్నై ఆటగాళ్లు మొయిన్‌ అలీ 5, ఫాఫ్ డుప్లెసిస్‌ 4, అంబటి రాయుడు 7 సిక్సర్లు బాదారు. ఇదే హైలట్ అనుకుంటే.. ముంబై హార్డ్ హిట్టర్ కిరాన్ పొలార్డ్‌ ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ తలో సిక్స్ బాధగా.. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా తలో రెండు సిక్సర్లు బాదారు. చెన్నై 16 సిక్సులు బాదితే.. ముంబై 14 సిక్సులు కొట్టింది. సిక్సుల వర్షం కురవడం, చివరి బంతి వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి కనబర్చారు.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8 మిలియన్ల మంది చూసారు. అదే అప్పుడు రికార్డు వ్యూయర్‌షిప్‌. ఈ సీజన్లో జరిగిన చెన్నై-ముంబై మ్యాచ్ 8.4తో దాన్ని అధిగమించింది. మొత్తానికి ఈ రెండు జట్ల ఎప్పుడు గేమ్ జరిగినా.. మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరాస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచును డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 7 మిలియన్ల మంది చూశారు.

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ చేయగా.. మొయిన్‌ అలీ (36 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలించింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కీరన్ పొలార్డ్‌ (34 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సులు వర్షం కురిపిస్తూ.. చివరి బంతికి ఊహించని విజయాన్ని అందించాడు.

Story first published: Sunday, May 2, 2021, 10:25 [IST]
Other articles published on May 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+