PBKS vs SRH: కేన్ మామ వచ్చాడు.. ఇక విజయం మనదే.. మనీష్ పాండేను తీసేసి మంచి పనిచేశారు!

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న ఈ కివీస్ స్టార్ పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ బరిలోకి దిగాడు. అతనితో పాటు కేదార్ జాదవ్ కూడా ఆరెంజ్ ఆర్మీ తరఫున అరంగేట్రం చేశాడు. తొడ కండరాల గాయానికి గురైన అబ్దుల్ సమద్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో సిద్దార్థ్ కౌల్‌ను తీసుకొచ్చారు.
అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్‌కు దిగగా.. మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడు మ్యాచ్‌ల్లో కూడా ఆరెంజ్ ఆర్మీ చేజింగ్ చేయలేక చేత్తులెత్తేసిన విషయం తెలిసిందే. అయితే కేన్ విలియమ్సన్ రాకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మామ వచ్చాడు..
కేన్ మామ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి రోజులు మొదలయ్యాయని ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా కేన్‌కు వెల్‌కమ్ చెబతూ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. మామ వచ్చాడు.. మనదే విజయం అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కేన్‌కు అవకాశం కల్పించిన టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు టీమ్ బాగుందని కామెంట్ చేస్తున్నారు.
యుద్దానికి సిద్దంకండి..
ఇక కేన్ విలియమ్సన్ రాకపై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. 'యుద్దానికి సిద్దంగా ఉండండి.. సమర శంఖం ఊదేందుకు కేన్ మామ ఉన్నాడు'అనే మీమ్ షేర్ చేస్తున్నారు. బాహుబలికి కట్టప్ప మామ ఎంత అవసరమో.. సన్‌రైజర్స్‌కు కేన్ మామ అంత అవసరమని కామెంట్ చేస్తున్నారు. కేన్ మామతో సన్‌రైజర్స్‌కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సన్‌రైజర్స్ టీమ్ బాగుందని అభిప్రాయపడుతున్నారు. కేన్‌ను చూసి పంజాబ్ వణికిపోతుందనే మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.
మనీష్ పాండేపై వేటు..
ఇక గత మూడు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని మనీష్ పాండేపై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసింది. అతని స్థానంలో సీనియర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు అవకాశం కల్పించారు. అయితే మనీష్ పాండేను తీసేసి మంచి పనిచేశారని చాలా మంది అభిప్రాయపడుతుంటే మరికొందరు మాత్రం అతన్ని కొనసాగించాల్సిందని కామెంట్ చేస్తున్నారు. విరాట్ సింగ్ కన్నా పాండేనే బెటరని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు విజయ్ శంకర్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారని కూడా నిలదీస్తున్నారు. గత మ్యాచ్ ఓటమికి శంకరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నటరాజన్ ఉండి ఉంటే కూడా బాగుండేదని ఇంకొందరూ అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications