Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శతక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. 7 సిక్స్‌లు..9 ఫోర్లతో వీర విహారం! (వీడియో)

మోరిస్విల్: మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రీచ్ క్లాసెన్ శతక్కొట్టాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన సీయాటెల్ ఓర్కాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందించాడు

SRH Fans reacts to Heinrich Klaasens blistering ton against MINY in MLC 2023

ఎంఐ బౌలర్లను చెడుగుడు ఆడిన క్లాసెన్.. 44 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా హెన్రీచ్ క్లాసెన్ చరిత్రకెక్కాడు. ఎంఐ న్యూయార్క్ స్టార్ స్పిన్నర్, అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్‌కు క్లాసెన్ చుక్కలు చూపించాడు.

అతను వేసిన 16వ ఓవర్‌లో వరుసగా 6, 6, 2, 4, 6, 2 మూడు సిక్స్‌లు, ఓ బౌండరీతో 26 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్లాసెన్ విధ్వంసంతో సీయాటెల్ టీమ్ 2 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. నికోలస్ పూరణ్(34 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. కీరన్ పొలార్డ్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సియాటెల్ బౌలర్లలో ఇమాద్ వసీం, హర్మీత్ సింగ్ రెండేసి వికెట్లు కొట్టగా.. కామెరూన్ గాన్నన్, ఆండ్రూ టై తలో వికెట్ తీసారు.

అనంతరం సియాటెల్ ఓస్కార్స్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 195 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ సెంచరీకి తోడుగా నౌమన్ అన్వర్(30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించారు. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(4/31) నాలుగు వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. రషీద్ ఖాన్(2/41) రెండు వికెట్లు తీయగా.. డేవిడ్ వైస్, కెంజిగే తలో వికెట్ తీసారు.

హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును కొనసాగించాలని, వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లోనూ చెలరేగాలని ఆకాంక్షిస్తున్నారు.

Story first published: Wednesday, July 26, 2023, 10:05 [IST]
Other articles published on Jul 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+