ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని.. ఆ నబీ, శంకర్ గాడు ఎందుకురా? మండిపడుతున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక అందరూ ఊహించనట్లే తుది జట్టులో భారీ మార్పులు చేసిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. అయితే ఇక్కడ అంతా అనుకున్నట్లు వార్నర్ స్థానంలో జాసన్ రాయ్ జట్టులోకి రాలేదు.
మహ్మద్ నబీ చాన్స్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా సుచిత్, సిద్దార్థ్ కౌల్ స్థానాల్లో భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ రీఎంట్రీ ఇచ్చారు. నయా సారథి కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని ఆరెంజ్ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే ఈ తుది జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏ చెప్పుతో కొట్టాలిరా?
ఇదేం జట్టని నిలదీస్తున్నారు. ఎన్నో ఏళ్లు జట్టుకు సేవలందించి, చాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్‌ను పక్కన పెట్టడం ఏ మాత్రం బాలేదని, ఇంతలా అవమానపర్చడం తగదని మండిపడుతున్నారు. కొందరైతే సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వార్నర్ స్థానంలో జాసన్ రాయ్‌ను తీసుకోకుండా? నబీని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. నబీ కోసమే వార్నర్ పక్కన పెట్టారా? అని నిలదీస్తున్నారు. టీమ్‌మేనేజ్‌మెంట్‌లో ఒక్కడికి తెలివి లేదని, ఇంత చెత్త నిర్ణయం ఏంటని మండిపడుతున్నారు. బలహీనమైన బ్యాటింగ్‌తో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆ శంకర్ గాడు ఎందుకురా?
అసలు జట్టులో ఏం చేస్తున్నాడని విజయ్ శంకర్‌కు అన్ని అవకాశాలిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌లో విఫలమవుతున్న అతనికి అండగా ఉండటం వెనుక అంతర్యం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. సమద్, భువీని తీసుకొచ్చి మంచి పనిచేసినా శంకర్, నబీలు జట్టుకు అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు. వార్నర్ లేని సన్‌రైజర్స్ హైదరాబాదే లేదని, ఈ మ్యాచ్‌లో ఎలా గెలుస్తారో? చూస్తామని సవాల్ విసురుతున్నారు. కనీసం జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకున్నా బాగుండేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
చాలా పెద్ద తప్పిదం..
ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్ద తప్పిదం చేసిందని, వార్నర్ తీసేయడం సరికాదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీపై వేటు వేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగించాల్సిందంటున్నారు. అసలు ఈ సీజన్‌లో టీమ్ ఓటమికి టీమ్‌మేనేజ్‌మెంట్ చెత్త నిర్ణయాలే కారణమని, ముందు వారిని మార్చాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సరైన ఆటగాళ్లు తీసుకోకుండా.. సత్తా లేని ఆటగాళ్లతో జట్టును నడిపించడం ఎవరికైనా కష్టమేనని, ముందు ఆ వీవీఎస్ లక్ష్మణ్‌ను జట్టులో నుంచి తీసేయాలని ట్వీట్ చేస్తున్నారు.
ఈ జట్టుకు అర్హత లేదు..
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లను ఆడించుకోవడానికి ఈ చెత్త ఫ్రాంచైజీకి అర్హత లేదని, వచ్చే సీజన్‌లోనైనా వేరే జట్లకు వెళ్లాలని కొందరూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఈ జట్టును చూసిన తర్వాత మ్యాచ్ చూడాలనే ఉత్సాహం.. గెలుస్తుందనే ఆశలన్నీ పోయాయని సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. మరికొందరూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ లేని మ్యాచ్‌ని అస్సలు చూడమని, ఈ సారి సన్‌రైజర్స్ మట్టికొట్టుకుపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications