For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ఇషాన్ కిషన్‌కు SRH గుడ్‌ బై? ఆ కేకేఆర్‌ ఆటగాడి కోసమే..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అప్‌కమింగ్ సీజన్‌పై ఫోకస్ పెట్టింది. టైటిలే లక్ష్యంగా జట్టును తయారు చేస్తోంది. ఇప్పటికే కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను నియమించింది. జట్టు ప్రక్షాళనపై కూడా ఫోకస్ పెట్టింది. జట్టులో కొనసాగించే ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను రూపొందిస్తోంది. రిటెన్షన్ ప్రక్రియకు ముందే ట్రేడింగ్ విండో ద్వారా ఆటగాళ్లను మార్చుకునే వెసులు బాటు కూడా పరిశీలిస్తోంది. ట్రేడింగ్ విండో ద్వారా కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్‌ను జట్టులోకి తెచ్చుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్‌కు బదులు ఇషాన్ కిషన్‌ను ఇచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను వదులుకునేందుకు కేకేఆర్ ట్రేడింగ్ విండో ఓపెన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్.. రూ. 23.75 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. 20 పరుగుల సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 354 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. అయితే చాలా మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. అతని వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. క్యాష్ డీల్ ద్వారా వెంకటేష్ అయ్యర్ తీసుకోవడానికి సన్‌రైజర్స్ ప్రయత్నం చేయవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ట్రేడింగ్ ద్వారా సంజూ శాంసన్ తీసుకోవాలని సీఎస్‌కే ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. రిషభ్ పంత్ కోసం ఢిల్లీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథనాలపై సంబంధిత ఫ్రాంచైజీలు ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.

SRH Eyes Venkatesh Iyer as Ishan Kishan s Replacement KKR Reportedly Ready for Trade Deal

ట్రేడింగ్ అంటే ఏంటంటే..?

ఆటగాళ్లను ఒక జట్టు నుంచి మరో జట్టుకు పరస్పర అంగీకారంతో మార్చుకోవడాన్ని ట్రేడింగ్ అంటారు. ఐపీఎల్‌లో ట్రేడింగ్ రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశ.. ఐపీఎల్ సీజన్ ముగిసిన ఏడు రోజుల తర్వాత ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది. తదుపరి సీజన్ కోసం వేలం నిర్వహించే వారం రోజుల ముందుకు వరకు ఇది కొనసాగుతోంది. ఈ సమయంలో ఫ్రాంచైజీలు.. ఆటగాళ్ల కోసం సంప్రదింపులు జరుపుకోవచ్చు. రెండో దశ.. ఐపీఎల్ వేలం ముగిసిన మరుసటి రోజు ఓపెన్ అవుతుంది. తదుపరి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి 30 రోజుల ముందు వరకు కొనసాగుతోంది.

ట్రేడ్ రకాలు..

ఆల్-క్యాష్ డీల్స్ : ఒక జట్టు కావాల్సిన ఆటగాడి కోసం అతని పాత జట్టుకు డబ్బు చెల్లిస్తుంది. గతంలో హార్దిక్ పాండ్యా(గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబైకి), కామెరూన్ గ్రీన్(ముంబై ఇండియన్స్ నుంచి ఆర్‌సీబీ) వంటి ఆటగాళ్ల ట్రేడ్‌లు ఈ విధంగానే జరిగాయి.

ప్లేయర్ స్వాప్స్: రెండు జట్లు ఆటగాళ్లను ఒకరికొకరు మార్చుకుంటాయి. దేవదత్ పడిక్కల్, ఆవేశ్ ఖాన్ ఇలానే ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారారు.

ఆటగాడిని ట్రేడ్ చేసినప్పుడు సదరు ఆటగాడి ధరను టీమ్ సాలరీ పర్స్‌ నుంచి కట్ చేస్తారు. అదే సమయంలో విక్రయించే జట్టుకు ఆ మొత్తం జమవుతుంది. అవసరమైతే ఎక్కువ జీతం ఇవ్వడానికి కూడా ఫ్రాంచైజీలు సిద్దపడుతాయి. అయితే ఇందుకు బీసీసీఐ అనుమతి అవసరం. విదేశీ ఆటగాళ్లను ట్రేడ్ చేయాలంటే వారి దేశ క్రికెట్ బోర్డుల అనుమతి అవసరం.

Story first published: Friday, July 18, 2025, 16:22 [IST]
Other articles published on Jul 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+