For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: మళ్లీ గెలిపించిన ప్రఫుల్ హింగే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఉప్పల్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)ను ఓడించింది. బ్యాటింగ్‌లో అభిషేక్, క్లాసెన్ సత్తా చాటితే.. బౌలింగ్‌లో ఇషాన్ మలింగా, నితీష్ రెడ్డి, ప్రఫుల్ హింగే నిప్పులు చెరిగారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59), హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/22), జెమీ ఓవర్టన్(3/37) మూడేసి వికెట్లు తీయగా..ముఖేష్ చౌదరి(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్జప్నీత్ సింగ్(1/34) ఒక వికెట్ దక్కింది.

అనంతరం సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ మాత్రే(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), మాథ్యూ షార్ట్(30 బంతుల్లో 3 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శివమ్ దూబే(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(3/29) మూడు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. శివాంగ్ కుమార్(1/18), సాకిబ్ హుస్సేన్(1/32), ప్రఫుల్ హింగే(1/60) చెరో వికెట్ తీసారు.

SRH Defeats CSK Eshan Malinga s Three-Wicket Burst and Praful Hinge s Final Over Heroics Secure 12-Run Win

మలుపు తిప్పిన మలింగా..

195 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌(7) త్వరగానే ఔటైనా.. ఆయుష్ మాత్రే దూకుడుగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి తన వరుస ఓవర్లలో ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్(19)లను ఔట్ చేసినా సీఎస్‌కే పవర్ ప్లేలో 76 పరుగులు చేసింది. ఆచితూచి ఆడిన సర్ఫరాజ్ ఖాన్, మాథ్యూ షార్ట్‌ జోడీని ఇషాన్ మలింగా విడదీసాడు. సర్ఫఱాజ్ ఖాన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే డేంజరస్ డెవాల్డ్ బ్రేవిస్(0)ను శివాంగ్ కుమార్ క్యాచ్ ఔట్ చేశాడు.

గెలిపించిన ప్రఫుల్ హింగే..

ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, మాథ్యూ షార్ట్‌లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ మాథ్యూ షార్ట్(34)ను మలింగా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. శివమ్ దూబే(21)ను హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. అన్షుల్ కంబోజ్ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌పై ఉత్కంఠగా మార్చాడు. ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. ప్రఫుల్ హింగే.. జెమీ ఓవర్టన్(16)ను ఔట్ చేసి సన్‌రైజర్స్ విజయాన్ని లాంఛనం చేశాడు. తొలి 3 ఓవర్లలో 53 పరుగులిచ్చిన ప్రఫుల్ హింగే.. ఆఖరి ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లోనూ ప్రఫుల్ హింగే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, April 18, 2026, 23:47 [IST]
Other articles published on Apr 18, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+