
ది హండ్రెడ్ లీగ్‌లో రషీద్, నబీ..
ప్రస్తుతం రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. రషీద్ ట్రెంట్ రాకెట్స్‌కు, నబీ లండన్ స్పిరిట్స్‌కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్కడి నుంచి నేరుగా యూఏఈ వచ్చి ఐపీఎల్ 14 రెండో దశల మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే తన కుటుంబాన్ని అఫ్గానిస్థాన్ నుంచి ఎలా తీసుకురావలన్నదానిపై రషీద్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

సంక్షోభంలో అఫ్గాన్ క్రికెట్..
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఈ నెలలోనే ఆఫ్ఘనిస్థాన్ టీమ్ శ్రీలంక టూర్ కూడా వెళ్లాల్సి ఉంది. ఆపై ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. ఈ రెండు పర్యటనలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2021 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అనుమానంగా మారగా.. ఆ వెంటనే జరిగే టీ20 ప్రపంచకప్‌లలో ఆ దేశ టీం పాల్గొనడం కూడా డౌటే. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ టాప్ జట్లను ఓడించడం కష్టమే. రషీద్ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

దేశం విడిచి పారిపోయిన..
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకోగానే.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆదివారం దేశం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం తాలిబన్లు అధ్యక్షుడి భవనాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దేశం విడిచి పారిపోయాడనే అపవాదు రాకుండా ఉండేందుకు అష్రఫ్ ఘనీ దేశ పౌరులను ఉద్దేశించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు.
ఆ లేఖలో తానెందుకు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే విషయాలను విడమర్చి చెప్పారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గానిస్థాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రాజధాని కాబూల్‌లో ఏయిర్ స్పేస్‌ను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications












