క్రికెట్‌పై తనకున్న మక్కువ కారణంగానే సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవ్వడంతోనే కెమెరాలు తనపై ఎక్కువ ఫోకస్ పెడ్తాయని చెప్పారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంత పాపులారిటీ ఉందో.. కావ్య మారన్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. కావ్య మారన్ కోసమే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు కూడా ఉన్నారు. ఫోర్, సిక్స్ కొట్టినా.. వికెట్ పడినా ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట వైరల్‌గా మారుతాయి.
ఈ క్రమంలోనే కావ్య మారన్‌కు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై కావ్య మారన్ స్పందించారు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కడ ఆడినా నేను వెళ్తాను. హైదరాబాద్‌లోనే కాకుండా అహ్మదాబాద్, చెన్నై లాంటి ప్రాంతాలకు కూడా నేను వెళ్తాను. టీమ్‌కు మద్దతు తెలుపుతాను. నేను చాలా దూరంలో కూర్చున్నా.. కెమెరాలు నా ఎక్స్‌ప్రెషన్స్‌పై ఫోకస్ పెడ్తాయి. అందుకే అవి మీమ్స్‌గా మారుతున్నాయి.'అని కావ్య మారన్ చెప్పుకొచ్చారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. వివిధ లీగ్స్‌లో ఫ్రాంచైజీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లను గుర్తించి, యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయి కోచింగ్ సౌకర్యాలను అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ రన్నరప్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 6వ స్థానంలో సరిపెట్టుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ అనే జట్టు కూడా ఉంది. ఆ జట్టు అరంగేట్ర సీజన్‌లోనే విజేతగా నిలిచింది. రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.