SRH vs LSG: మా ఓటమికి కారణం అదే: ఇషాన్ కిషన్
టాపార్డర్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోతే ప్రత్యర్థి జట్టు పని సులువు అవుతుందని చెప్పాడు. అదనంగా మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇషాన్ కిషన్.. ఓడినా గర్వంగా ఉందని చెప్పాడు. 'ఇదొక అద్భుతమైన మ్యాచ్. అయితే మా బోర్డుపై తగినంత స్కోరు లేదు. అయినా మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. మా ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేశారు. మా ఫీల్డర్లు కూడా సత్తా చాటారు. కానీ ఇలాంటి లో స్కోర్ గేమ్స్‌లో ఒకటి రెండు బౌండరీలు ఇటు అటు అయితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఏదేమైనా.. ఈ మ్యాచ్‌లో మేం పోరాడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను.
బ్యాటింగ్‌లో మెరుగవ్వాలి..
బ్యాటింగ్‌లో మేం 100 శాతం మెరుగవ్వాలి. ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోతే.. ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ క్లాసెన్, నితీష్ అసాధారణ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో వారు ఆడి చూపించారు. మా స్కోర్ క్రెడిట్ పూర్తిగా వారిదే. మేం బ్యాటింగ్‌ను ఇంకా మెరుగుపర్చుకోవాలి. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ప్రత్యర్థి జట్టు పని ఈజీ అవుతుంది.

మా బౌలింగ్‌తో లక్నోను కూడా దెబ్బతీయాలనుకున్నాం. కానీ రిషభ్ పంత్ సింగిల్స్ తీస్తూ చాలా తెలివిగా ఆడాడు.
ఇలాంటి స్కోర్లను ఛేజ్ చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి ఆటనే కోరుకుంటారు. మేం బాగానే బౌలింగ్ చేశాం. కానీ రిషభ్ పంత్ మెరుగ్గా బ్యాటింగ్ చేసి మా విజయవకాశాలను దెబ్బతీసాడు. వికెట్లు కోల్పోయిన సమయంలో లక్నోకు ఒక భాగస్వామ్యం అవసరమైంది. అది పంత్ అందించాడు. వాస్తవానికి ఈ స్కోర్ కాపాడుకోవడం చాలా కష్టం. కానీ మ్యాచ్‌ను మేం ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లాం. ఇది మాకు సానుకూల అంశం.
అందుకే పూర్తి కోటా వేయించలేదు..
వికెట్లు తీయాలనే ఉద్దేశంతో హర్షల్ పటేల్‌తో కాకుండా హర్ష్ దూబేతో బౌలింగ్ చేయించాను. ఆ ఓవర్లలో అతను వికెట్లు తీసి చాలా బాగా బౌలింగ్ చేశాడు. అది మా నిర్ణయమే. కానీ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు ఒకటి రెండు బౌండరీలు అకస్మాత్తుగా మ్యాచ్‌ని మార్చేస్తాయి. 17వ ఓవర్లో అదే జరిగింది. రెండు మూడు బౌండరీలు వచ్చాయి. కానీ హర్ష్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో అతను ఇదే తరహాలో బౌలింగ్ చేయాలని కోరుకుంటన్నాం.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), నితీష్ కుమార్ రెడ్డి(33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేష్ రతి, మణిమరణ్ సిద్దార్థ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 160 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) పర్వలేదనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్ష్ దూబే(2/18) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్ చెరో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications