IPL 2021: ఆసుపత్రిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్.. గుండెకు సర్జరీ!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆసుపత్రి పాలయ్యాడు. అతని గుండె రక్తనాళాల్లో ఒక చోట పూడిక ఉన్నట్లు గత మార్చిలోనే గుర్తించిన వైద్యులు.. తాజాగా ఆ పూడికని తొలగించడానికి యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఈ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మురళీధరన్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరుతాడు. అయితే మురళీ ధరణ్ సర్జరీ విజయంపై సన్‌రైజర్స్ టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

స్పిన్ మాంత్రికుడు..
ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగానే హైదరాబాద్ మ్యాచ్‌లు ఆడుతుందన్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ గుర్తింపు పొందాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన మురళీధరన్.. మొత్తం 1,347 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇందులో కేవలం టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్ మాంత్రికుడు.. వన్డేల్లో 534, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అంతేకాకుండా.. శ్రీలంక గెలిచిన 1996 వరల్డ్‌కప్ టీమ్‌లోనూ మురళీధరన్ కీలక పాత్ర పోషించాడు.

2015 నుంచి జట్టుకు సేవలు..
2015 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్, మెంటార్‌గా కొనసాగుతున్న 49 ఏళ్ల ముత్తయ్య మురళీధరన్.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు ఎస్ఆర్‌హెచ్ టీమ్ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ చేతుల్లోనూ పరాజయం పాలైంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్‌లోనే హైదరాబాద్ తడబడటం గమనార్హం. ఈ మూడు కూడా సన్‌రైజర్స్ సూనాయసంగా గెలిచే మ్యాచ్‌లే కానీ మిడిలార్డర్ వైఫల్యంతో ఆరెంజ్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది.

ఈ ఏడాది కలిసి రావడం లేదు..
సర్జరీ కారణంగా మురళీధరన్ ముంబైతో మ్యాచ్‌కు మురళీధరన్ దూరంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఏ మాత్రం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలకు తోడు ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కేన్ విలియమ్సన్ గాయంతో బెంచ్‌కే పరిమితం అవుతుండగా.. తాజాగా నటరాజన్ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు. ఇప్పుడు కీలక కోచ్ అయిన మురళీ ధరన్ ఆసుపత్రిపాలయ్యాడు. ఇక తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా బుధవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications