Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ విధ్వంసం..! (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్(ఎమ్‌పీఎల్) 2024 సీజన్‌లో కోల్హాపూర్ టస్కర్స్‌కు సారథ్యం వహిస్తున్న రాహుల్ త్రిపాఠి.. రత్నగిరి జెట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 39 బంతుల్లో 63 పరుగులు నమోదు చేశాడు.

నెంబర్-3లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ త్రిపాఠి.. తొలి బంతి నుంచే తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి కొట్టిన ఓ సిక్సర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

SRH batter Rahul Tripathi clears the rope with a stunning slog sweep Video Goes Viral

కోల్హాపూర్ టస్కర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో ఓ బంతిని ప్రత్యర్థి పేసర్ ప్రదీప్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. త్రిపాఠి స్లాగ్ స్వీప్ షాట్‌తో సిక్సర్ రాబట్టాడు. ప్రస్తుతం ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీకి ఫలితం లేకుండా పోయింది. అతనికి తోడుగా మరే బ్యాటర్ రాణించకపోవడంతో 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్హాపూర్ 9 వికెట్లకు 169 పరుగులే చేసి 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో రాహుల్ త్రిపాఠి సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 188 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ రాహుల్ త్రిపాఠి మెరుగైన ప్రదర్శన చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్ -1లో 35 బంతుల్లో 55 పరుగులు చేసిన అతను.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 17 బంతుల్లో 37 పరుగులు నమోదు చేశాడు. కానీ కీలక ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి 143.47 స్ట్రైక్‌రేట్‌తో 165 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, June 11, 2024, 17:50 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+