Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ బ్యాటర్ విధ్వంసం.. 13 సిక్సర్లతో వీర విహారం!

సెంచూరియన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ ( 83 బంతుల్లో 13 ఫోర్లు 13 సిక్స్‌లతో 174) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 13 ఫోర్లు 13 సిక్స్‌లతో వీర విహారం చేశాడు. క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 5 వికెట్లకు 416 పరుగులు చేసింది.

అతనికి తోడుగా రాసీ వాన్ డర్ డస్సెన్(65 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), డేవిడ్ మిల్లర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, మైకేల్ నేసర్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ పడగొట్టారు.

SRH

38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్.. 57 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను 77 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. తొలి హాఫ్ సెంచరీకి 38 బంతులు తీసుకున్న అతను మరో 19 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంకో 20 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు.

ఐదో వికెట్‌కు మిల్లర్‌తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు గెలవగా.. సౌతాఫ్రికా ఓ మ్యాచ్ గెలిచింది. తాజా మ్యాచ్ కూడా గెలిచి 2-2తో సిరీస్ సమం చేసి సిరీస్ డిసైడర్‌ ఆడాలని భావిస్తోంది.

ఐపీఎల్‌లో హెన్రీచ్ క్లాసెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 సీజన్‌లో హెన్రీచ్ క్లాసెన్ ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో సన్‌రైజర్స్ పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. క్లాసెన్ సూపర్ ఇన్నింగ్స్‌పై హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, September 15, 2023, 21:22 [IST]
Other articles published on Sep 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+