లండన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), ది హండ్రెడ్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ మూడు లీగ్స్‌లో సెంచరీ చేసిన ఆటగాడు ఒక్కరు కూడా లేరు. తాజాగా హెండ్రెడ్ లీగ్‌లో శతకం సాధించడం ద్వారా హ్యారీ బ్రూక్ ఈ ఫీట్‌ను సాధించాడు.
ఈ లీగ్‌లో నార్త్రన్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రూక్.. మంగళవారం వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఇది వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ 2023 సీజన్‌లో హ్యారీ బ్రూక్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఐపీఎల్‌కు ముందు పీఎస్‌ఎల్ ఆడిన బ్రూక్.. లాహోర్ ఖలందర్స్ జట్టు తరఫున సెంచరీ బాదాడు. పీఎస్‌ఎల్ 2022 సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అతని పీఎస్‌ఎల్ ప్రదర్శన చూసే సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన హ్యారీ బ్రూక్.. 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటైన హ్యారీ బ్రూక్.. 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.
ఈ పేలవ ప్రదర్శనతోనే అతనిపై వేటు వేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతన్ని వదులుకోనుంది.
గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 1181 పరుగులు చేశాడు. 3 వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 86 పరుగులు. 20 టీ20ల్లో 372 పరుగులు చేశాడు.