Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: కావ్య మారన్ ట్రేడ్ డీల్.. SRHలోకి ఆర్‌సీబీ ప్లేయర్‌!

ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ డీల్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్లేయర్ స్వాప్ డీల్ ద్వారా ఆర్‌సీబీ వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ జితేష్ శర్మను జట్టులోకి తీసుకోవాలని కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ప్రయత్తిస్తున్నట్లు సమాచారం.

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!

జితేష్ శర్మ కోసం తమ వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను వదులుకునేందుకు కూడా ఆరెంజ్ ఆర్మీ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. లోయర్ మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దూకుడుగా ఆడే ఎడమచేతివాటం ఓపెనర్ కోసం ఆర్‌సీబీ ప్రయత్నాలు చేస్తోంది.

SRH and RCB Could Explore a Direct Ishan Kishan Jitesh Sharma Player Swap Ahead of IPL 2027 Reports

ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ తమకు సరిగ్గా సరిపోతాడని ఆర్‌సీబీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రేడ్ డీల్ చర్చల్లో ఉందని, అతి త్వరలోనే తుది నిర్ణయానికి రెండు ఫ్రాంచైజీలు రానున్నాయని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. అయితే ఈ వార్తలను ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. జితేష్ శర్మ కోసం ఇషాన్ కిషన్‌ను ఆరెంజ్ ఆర్మీ అస్సలు వదులుకోదని కామెంట్ చేస్తున్నారు. ఇంతకన్నా తెలివితక్కువ ట్రేడ్ డీల్ ఉండదని, ఇలా ఎవరూ అంగీకరించరని కామెంట్ చేస్తున్నారు.

IPL 2026: తుది జట్టు ఎంపికలో కావ్య మారన్ జోక్యం: SRH ప్లేయర్

IPL 2026: తుది జట్టు ఎంపికలో కావ్య మారన్ జోక్యం: SRH ప్లేయర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇషాన్ కిషన్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో 602 పరుగులు చేశాడు. మరోవైపు జితేష్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన అతను 12.89 సగటుతో 116 పరుగులే చేశాడు. ఫామ్‌లో లేని బ్యాటర్ కోసం ప్రధాన ఆటగాడిని వదులుకుంటారా? అని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచి వరుసగా రెండో టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్‌సీబీ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అద్వితీయమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరింది. ఆర్‌సీబీ తరహాలోనే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. కానీ తక్కువ రన్‌రేట్ కారణంగా క్వాలిఫయర్-1 బెర్త్‌ను తృటిలో కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ధాటికి ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Wednesday, July 29, 2026, 15:33 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+