వైభవ్ సూర్యవంశీ.. వారికి దూరంగా ఉండు: శ్రీశాంత్ వార్నింగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 15 ఏళ్ల వయసులోనే ఈ బిహార్ కుర్రాడు వరల్డ్ రికార్డ్స్ నమోదు చేశాడు. తనకే నమోదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్ ముఖచిత్రంగా మారాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో వైభవ్ (776) అవార్డుల మోత మోగించాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ప్రొఫెషనల్ మేనేజర్లకు దూరంగా ఉండు..
ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అతని బ్యాటింగ్, ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. అయితే వైభవ్ సూర్యవంశీని టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ హెచ్చరించాడు.

ప్రొఫెషనల్ మేనేజర్లకు దూరంగా ఉండాలని, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించాడు. చిన్నవయసులోనే సక్సెస్ అందుకున్న వైభవ్ సూర్యవంశీని జాగ్రత్తగా చూసుకోవాలని అతని తండ్రి సంజీ సూర్యవంశీని శ్రీశాంత్ ప్రత్యేకంగా కోరాడు.
చిన్నోడా.. క్రికెట్ మాత్రమే ఆడు..
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ కేవలం క్రికెట్‌పై మాత్రం దృష్టిపెట్టాలని శ్రీశాంత్ సలహా ఇచ్చాడు. 'వైభవ్.. నువ్వు ఈ ఇంటర్వ్యూ చూస్తే.. ఇదే నా అభ్యర్థన. ఈ మేనేజర్లను పక్కనపెట్టి నీ క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టు. నీ తండ్రి, కుటుంబం అన్నీ చూసుకుంటారు. ప్రొఫెషనల్ మేనేజర్లకు దూరంగా ఉండు.
వైభవ్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను యువ ఆటగాళ్లకు, క్రికెట్‌లో రాణించాలని కలలు కనే ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయుడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అడుగుజాడల్లో వైభవ్ సూర్యవంశీ చూపిన అంకిత భావం అపారమైనది.
కరోనా సమయంలో కూడా..
కరోనా సమయంలో కూడా వైభవ్ సూర్యవంశీ ఇంటిపై కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అతని తండ్రికి, కోచ్‌లకు నా సెల్యూట్. అవకాశం గురించి ఆలోచించకుండా.. వైభవ్‌ను ప్రోత్సహించారు. వైభవ్ కూడా రోజు నాలుగు గంటలు ప్రయాణించి.. రోజూ 750 నుంచి 1000 బంతులను ఎదుర్కొంటూ శ్రద్దగా ప్రాక్టీస్ చేశాడు. అతనికి బ్రేక్ తీసుకోవాలనే కోరిక కూడా కలగలేదు. అతన్ని అలా చూడటం అద్భుతంగా అనిపించింది.'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఎండార్స్‌మెంట్ వ్యవహారాలను రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటుంది. వైభవ్, అతని కుటుంబానికి క్రీడా ప్రపంచంలోని వ్యాపార రంగం కొత్త కావడంతోనే శ్రీశాంత్ హెచ్చరికకు ప్రాధాన్యత సంతరించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

