అతనే నా బెస్ట్ బ్యాట్స్‌మన్.. త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తా: శ్రీశాంత్

హైదరాబాద్: తన బెస్ట్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని టీమిండియా వరల్డ్‌కప్ విన్నింగ్ బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడ్తానని ఈ కేరళ క్రికెటర్ ధీమా వ్యక్తం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఏడేళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అతని బ్యాన్ ఈ ఏడాది ఆగష్టుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఫ్రొఫేషనల్ క్రికెట్ ఆడాలని భావిస్తున్న ఈ భారత పేసర్.. శుక్రవారం Helo యాప్‌లో అభిమానులతో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ తొలి వారంలో తాను క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలిపాడు. ఈ లైవ్ సెషన్‌లో శ్రీశాంత్ బెంగళూరు స్కూల్ డేస్, మొదటి చూపులోనే ప్రేమలో పడటం, సచిన్ కోసం ప్రపంచకప్ గెలవడం లాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆ విషయంలో కోహ్లీని ఫాలో అవుతున్నా..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లాగా తాను నిత్యం ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని... ఫిట్‌నెస్‌లో లెగ్స్ ఎక్స్‌ర్‌సైజ్ తనకు ఇష్టమైని తెలిపాడు. తన కెరీర్ ఆరంభంలో దాదా తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని తెలిపాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి తాను ప్రొఫెషనల్ క్రికెట్ ప్రపంచంలోకి రానున్నట్లు చెప్పాడు. ధోనీ దిగ్గజ క్రికెటర్ అని కొనియాడిన శ్రీశాంత్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియాకు తిరిగి ఆడాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

పాక్‌తో మ్యాచ్ ఆడను..
కరోనా బాధితుల కోసం భారత్- పాకిస్తాన్ మధ్య ఫండ్ రైజింగ్ సిరీస్ నిర్వహించాలని షోయబ్ అక్తర్ చేసిన సూచనను శ్రీశాంత్ సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుత పరిస్తితుల్లో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరగడం అసాధ్యమని... దేశం, దేశం యొక్క భావాలు మనకు ముఖ్యమన్నాడు. 2011 ప్రపంచకప్‌లో సచిన్, యువరాజ్ తనను ప్రోత్సహించిన తీరు మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు..

నా బెస్ట్ కెప్టెన్, బౌలర్..
ఈ లైవ్ సెషన్‌లో అభిమానులు అడిగిన పలు ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు శ్రీశాంత్ సమాధానాలిచ్చాడు. ‘నేను బౌలింగ్ చేసిన అత్యత్తమ బ్యాట్స్‌మన్ సచిన్, హేడెన్. విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా ఇష్టమే. రంజీల్లో సచిన్ వికెట్ తీయడం ప్రపంచకప్ గెలిచినంత సంతోషానిచ్చింది. సచిన్ వికెట్ తీయాలన్న నా కోరిక కూడా నిజమైంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా సచిన్‌లానే ఉన్నాడు. నా బెస్ట్ బ్యాట్స్ మన్ కూడా విరాట్ కోహ్లీనే. బౌలర్ మాత్రం బుమ్రా. కెప్టెన్ కపిల్ దేవ్, టెస్ట్ బౌలర్ మాత్రం మిచెల్ స్టార్క్' అని తెలిపాడు.

మరిచిపోలేని క్షణం..
తన జీవితంలో మరిచిపోలేని క్షణం తన ఆరాథ్య దైవమైన సచిన్ టెండూల్కర్‌తో ప్రపంచ కప్ గెలవడమని ఈ కేరళ స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు. తనకు వ్యాయామం, డ్యాన్స్ చేయడం ఇష్టమని తెలిపాడు. బెంగళూరులోని విద్యారణ్యపురలో ఉన్నప్పుడు కర్ణాటక రానాజీ జట్టు తరపున ఆడాలనుకున్న కుదరలేదని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఇక అండర్-19 కేరళ జట్టు తరపున అదే కర్ణాటక జట్టుపై 5 వికెట్లు తీశానని గుర్తు చేసుకున్నాడు.
ఇక ఈ లాక్‌డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నానని తెలిపిన శ్రీశాంత్.. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక తన సతీమణి భువనేశ్వరిని తొలి చూపులోని ప్రేమించినాన్నాడు. సచిన్ పుట్టినరోజైన ఏప్రిల్ 24న మళ్లీ అభిమానులను Helo లైవ్‌లో కలుస్తానని శ్రీశాంత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications