Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ కాదు.. ధోనీలాంటి మెంటార్ కావాలి: శ్రీశాంత్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ టీమిండియాకు అవసరం లేదని, అతని స్థానంలో ధోనీలాంటి ఫ్రెండ్లీ కోచ్‌‌ను ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. శ్రీశాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్‌ల్లో టీమిండియా పతనానికి గౌతమ్ గంభీరే కారణమని శ్రీశాంత్ ఆరోపించాడు. 'ముందు టీమిండియా కోచ్‌‌ను మార్చండి. భారత జట్టుకు ఒక మెంటార్ కావాలి. అతను ఆటగాళ్లకు ఒక పెదన్నలా ఉండాలి. గెలిచినప్పుడు నవ్వి, ఓడిపోయినప్పుడు కోపగించుకునే కోచ్ వద్దు. ధోనీ ఆటగాళ్లపై ఎప్పుడూ అలాంటి ఒత్తిడి పెట్టలేదు. భారత జట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలి.

Change the Coach Sreesanth Slams Gautam Gambhir s Coaching Style Urges BCCI to Bring Back MS Dhoni as Mentor

గంభీర్‌‌కు ఎందుకు క్రెడిట్

ఈ ఏడాది భారత్ సాధించిన టీ20 ప్రపచకప్ 2026 వియయంలో అధిక క్రెడిట్ హెడ్ కోచ్‌కు ఇవ్వడం సరికాదు. మైదానంలో ఆటగాళ్లు పడ్డ కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైంది. సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల కృషి, సరైన బౌలింగ్ మార్పులు ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒకవేళ సంజూ శాంసన్ రాణించకపోయి ఉంటే.. సూర్య కెప్టెన్సీ బాగా లేకపోయి ఉంటే భారత్ విజేతగా నిలిచేదా? మైదానంలోకి వచ్చి కోచ్‌ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా?'అని శ్రీశాంత్ ప్రశ్నించాడు.

హర్భజన్ ఇప్పుడురా చూసుకుందాం..

అంతకుముందు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు శ్రీశాంత్ సవాల్ విసిరాడు. ఐపీఎల్ చెంపదెబ్బ ఘటనను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్క్రీన్ వెనుక ఉన్న హర్భజన్ సింగ్ ఫొటోను చూపిస్తూ.. 'నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్‌లోకి రా.. అక్కడ తేల్చుకుందాం.'అని భజ్జికి సరదాగా సవాల్ విసిరాడు. ప్రస్తుతం తాను బేర్ నకిల్ ఫైలింగ్ లీగ్‌తో సంబంధం కలిగి ఉన్నానని, కోనర్ మెక్ గ్రోర్ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నాని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

ఘోర పరాజయాలు..

టీమిండియా హెడ్ కోచ్‌‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్ బాల్ ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్.. టెస్ట్‌ల్లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు టీ20 ప్రపంచకప్ 2026‌ టైటిళ్లను గెలిచినా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. తాజా ఎడిషన్‌లోనూ సొంతగడ్డపై ఘోర పరాజయాలను చవిచూసి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా 2024లో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిన భారత్.. గతేడాది సౌతాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. సొంతగడ్డపై టీమిండియా గతంలో ఎన్నడూ టెస్ట్ సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అవ్వలేదు.

Story first published: Friday, June 19, 2026, 13:21 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+