
వాడు పీకేదేం లేదు..
అద్భుతాలు చేయడం అతనికి చేతకాదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ భారత్ టీ20 ప్రపంచకప్ గెలిస్తే ఆ ఘనత ఆటగాళ్లు, హెడ్ కోచ్ ద్రవిడ్ భాయ్‌కు మాత్రమే దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా మిడ్-డే దినపత్రికతో మాట్లాడిన శ్రీశాంత్ ప్యాడీ అప్టన్ నియామకంపై స్పందించాడు. 'అప్టన్‌కు అంత సీన్ లేదు. అతను అద్భుతాలు చేయలేడు. ఒకవేళ మనం టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే అది కేవలం మన ఆటగాళ్ల ప్రదర్శన.. రాహుల్ భాయ్ అనుభవం వల్లే. మనకు పటిష్టమైన జట్టు ఉంది. అంతేగానీ.. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి జట్టుతో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు'అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.

ఆ చనువుతోనే..
2011 వన్డే ప్రపంచకప్ విజయంలో అప్టన్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమేనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. '99 శాతం పనిని పూర్తి చేసింది గ్యారీ కిర్‌స్టన్.. అప్టన్ ఆయనకు కేవలం అసిస్టెంట్ మాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా రాహుల్ భాయ్‌తో కలిసి పనిచేశాడు కాబట్టే మళ్లీ టీమిండియా సిబ్బందిలో భాగం కాగలిగాడు. నిజానికి అతను మంచి యోగా టీచర్. కాబట్టి రాహుల్ భాయ్ కచ్చితంగా అతని సేవలు వాడుకుంటాడు'అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
కాగా ఈ కేరళ పేసర్ గతంలో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్-2013 సీజన్‌లో భాగంగా శ్రీశాంత్‌తో పాటు ద్రవిడ్, అప్టన్ కూడా ఈ ఫ్రాంఛైజీ తరఫున పనిచేశారు.

అప్టన్‌తో శ్రీశాంత్‌కు గొడవ..
ఈ నేపథ్యంలో శ్రీశాంత్, ద్రవిడ్- అప్టన్ ద్వయం మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తన ఆటోబయోగ్రఫీలో అప్టన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సమయంలో తుది జట్టులో చోటు దక్కని కారణంగా శ్రీశాంత్.. తనను, ద్రవిడ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని రాసుకొచ్చాడు. ఈ క్రమంలోనే శ్రీశాంత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మసకబారిన శ్రీశాంత్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఇక 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్, గెలిచిన టీమిండియాలో శ్రీశాంత్ సభ్యుడు.

మానసిక నిపుణుడిగా..
ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయగల నిపుణుడిగా పేరొందిన ప్యాడీ అప్టన్.. భారత్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా అప్టన్‌ను మరోసారి టీమిండియా మెంటల్ కండిషనింగ్ హెల్త్‌కోచ్‌గా బీసీసీఐ నియమించింది.


Click it and Unblock the Notifications












